తేజతో కాజల్.. మరోసారి..?

Published : May 16, 2019, 03:25 PM IST
తేజతో కాజల్.. మరోసారి..?

సారాంశం

దర్శకుడు తేజ, హీరోయిన్ కాజల్ ల మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

దర్శకుడు తేజ, హీరోయిన్ కాజల్ ల మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాజల్ కి తొలి సినిమా ఛాన్స్ ఇచ్చింది తేజానే.. అతడు రూపొందించిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో కాజల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత వీరిద్దరూ కలిసి 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాకు పని చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి 'సీత' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వచ్చే వారం ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తరువాత తేజ, కాజల్ కలిసి మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట.

థ్రిల్లర్ నేపధ్యంలో సాగే ఓ కథను కాజల్ కోసం సిద్ధం చేశాడు తేజ. నిర్మాతలు కూడా సిద్ధంగానే ఉన్నారు. 'సీత' సినిమాకు వచ్చే రెస్పాన్స్ ని బట్టి వెంటనే ఈ కాంబినేషన్ ని సెట్స్ పైకి తీసుకువెళ్లాలా..? లేదంటే కొంత గ్యాప్ ఇవ్వాలా అనే విషయంలో ఓ నిర్ణయానికి వస్తారు.

'సీత' సినిమా గనుక హిట్ అయితే ఈ కాంబినేషన్ కి మంచి క్రేజ్ వస్తుంది. బిజినెస్ పరంగా డిమాండ్ కూడా పెరుగుతుంది. 'సీత' రిజల్ట్ ని బట్టి కొత్త సినిమా అనౌన్స్మెంట్  ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

Allu Arjun Fees: దేశంలోనే అత్యంత ఖరీదైన స్టార్‌గా అల్లు అర్జున్.. ఒక్క దెబ్బతో రజినీ, షారుఖ్ రేంజ్
Venkatesh: ఫస్ట్ మూవీలోనే బికినీలో చూపించింది అందుకే.. ఓపెన్ గా చెప్పేసిన డైరెక్టర్, వెంకటేష్ కష్టాలు