బాలయ్య కోసం బోయపాటి ఎదురుచూపులు!

Published : May 16, 2019, 02:54 PM IST
బాలయ్య కోసం బోయపాటి ఎదురుచూపులు!

సారాంశం

నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన తదుపరి సినిమా బోయపాటితో ఉంటుందని అనౌన్స్ చేశారు. 

నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన తదుపరి సినిమా బోయపాటితో ఉంటుందని అనౌన్స్ చేశారు. అన్నీ ఓకే అనుకున్న తరువాత ఈ ప్రాజెక్ట్ వాయిదా పడింది. బోయపాటి స్థానంలో దర్శకుడు కె.ఎస్.రవికుమార్ వచ్చాడు. బాలకృష్ణ ముందుగా రవికుమార్ సినిమా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు.

సెప్టెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా పూర్తయ్యేలోపు బోయపాటి మరో హీరోతో సినిమా చేస్తాడని అనుకున్నారు. గతంలో అఖిల్ కోసం స్క్రిప్ట్ రెడీ చేశాడు ఈ దర్శకుడు. డైలాగ్ వెర్షన్ తో సహా బౌండెడ్ స్క్రిప్ట్ పెట్టుకున్నాడు.

కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు దాన్ని లైన్ లోకి తీసుకొచ్చే ఛాన్స్ వచ్చింది. అఖిల్-బోయపాటిల మధ్య కథాచర్చలు కూడా జరిగాయి. నిర్మాతలు కూడా ముందుకొచ్చారు. కానీ బోయపాటి మాత్రం ఇప్పటిలో ఈ ప్రాజెక్ట్ వద్దని చెబుతున్నాడట.

బాలయ్య కోసం స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నానని, ఆలస్యమైనా బాలయ్య సినిమానే చేస్తానని ఈలోగా మరో సినిమా జోలికి పోనని చెప్పాడట. మరి బాలయ్య కోసం ఎదురుచూస్తున్న బోయపాటి ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి!
 

PREV
click me!

Recommended Stories

చిరంజీవికి ఎక్కువ డైలాగ్స్ లేకున్నా.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా? మెగాస్టార్ కెరీర్ మార్చేసిన మూవీ?
Top 5 Female Villains: గ్లామర్‌తో కాదు, క్రూరత్వంతో అదరగొట్టారు.. విలన్లుగా మారిన బెస్ట్ టాప్‌ 5 హీరోయిన్లు వీరే