Bigg Boss Telugu 7: శోభా శెట్టి, రతికలకు తేజ గట్టిగా హగ్గులు.. అమ్మాయిలా మారి పండగ చేసుకున్న కంటెస్టెంట్‌

By Aithagoni Raju  |  First Published Nov 1, 2023, 5:51 PM IST

తేస్టీ తేజ బిగ్‌ బాస్‌ హౌజ్‌లో తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు. సరదాగా ఉంటూ ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా శోభా శెట్టితో పులిహోర కలుపుతూ ఎంటర్‌టైన్‌ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.


బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ తొమ్మిదో వారం.. బుధవారం ఎపిసోడ్‌ ఆసక్తికరంగా సాగింది. కెప్టెన్సీ టాస్క్ లతోపాటు కంటెస్టెంట్లు చేసిన ఫన్నీ యాక్టివిటీస్‌ నవ్వులు పూయించింది. తాజాగా విడుదలైన ప్రోమోలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. ఇందులో ప్రధానంగా టేస్టీ తేజ హైలైట్‌గా నిలిచాడు. ఆయన అమ్మాయిలా మారడం ఆకట్టుకుంది. చీరకట్టుకుని అమ్మాయిలా ముస్తాబై కాసేపు హౌజ్‌లో సందడి చేశాడు. అందరిని అలరించింది. 

అయితే ఇదే అదనుగా చేసుకుని తన కోరికలు తీర్చుకున్నాడు టేస్టీ తేజ. ఆయన శోభా శెట్టితో పులిహోర కలుపుతున్న విషయం తెలిసిందే. ఇద్దరు ఓపెన్‌గానే తమ ప్రేమలను వ్యక్తం చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటాననే వరకు వెళ్లింది వీరి వ్యవహారం, అంతేకాదు హోస్ట్ నాగార్జున ముందే పులిహోర కలుపుకుంటూ అలరించారు. అయితే ఇప్పుడు అన్నంత పనిచేశాడు టేస్టీ తేజ. అమ్మాయిలా మారి తన కోరికలు తీర్చుకున్నాడు. 

Latest Videos

అమ్మాయిలు అమ్మాయిలు కలుసుకున్నప్పుడు ఏం చేస్తారో చేసి చూపించండి అంటే, శోభా శెట్టి, ప్రియాంకలు హగ్‌ చేసుకున్నారు. ఇప్పుడు తను కూడా అమ్మాయిగా మారడంతో అటు శోభా శెట్టికి హగ్గుల మీద హగ్గులిచ్చాడు. అంతటితో ఆగలేదు.. రతిక కూడా హగ్గులిచ్చి రెచ్చిపోయాడు. ఓ రకంగా పండగ చేసుకున్నాడు తేజ. అంతా అయిపోయాక.. అమ్మాయిలు అమ్మాయిల్లానే ఉన్నారంటూ కామెంట్‌ చేయడం విశేషం. 

ఇక తొమ్మిదో వారంలో అమర్‌ దీప్‌, రతిక, శోభా శెట్టి, ప్రియాంక, అర్జున్‌, భోలే, తేజ, యావర్‌ నామినేషన్స్ లో ఉన్నారు. శివాజీ, ప్రశాంత్‌, అశ్విని ఈ వారం నామినేషన్‌లోకి రాలేదు. ఇదిలా ఉంటే వచ్చే వారానికి సంబంధించి కెప్టెన్సీ టాస్క్ లు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. ఇప్పటి వరకు ఎనిమిది వారాలు పూర్తి కాగా.. గత వారం సందీప్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. అంతకు ముందు పూజా, అలాగే నయని పావని, రతిక, శోభా శెట్టి, దామిని, షకీలా, కిరణ్‌ రాథోర్‌ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. అయితే బిగ్‌బాస్‌ ఇచ్చిన మరో ఛాన్స్ లో రతిక రీఎంట్రీ ఇచ్చింది. 
 

click me!