'టార్గెట్ పవన్' : పూనమ్ కి రూ.15 కోట్ల ఆఫర్!

Published : Jan 22, 2019, 10:20 AM IST
'టార్గెట్ పవన్' : పూనమ్ కి రూ.15 కోట్ల ఆఫర్!

సారాంశం

ఏపీలో ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పవన్ 'జనసేన పార్టీ' కూడా పాల్గొనబోతుంది. దీంతో రాజకీయాల వేడి మరింతగా పెరిగింది. రాజకీయాల పరంగా పవన్ ని బద్నామ్ చేయడానికి ఓ వర్గం ప్రయత్నిస్తోంది. 

ఏపీలో ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పవన్ 'జనసేన పార్టీ' కూడా పాల్గొనబోతుంది. దీంతో రాజకీయాల వేడి మరింతగా పెరిగింది.

రాజకీయాల పరంగా పవన్ ని బద్నామ్ చేయడానికి ఓ వర్గం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పవన్ వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ అతడిపై విమర్శలు చేస్తోన్న ఈ వర్గం ఈసారి మరోప్లాన్ చేస్తోందట. దీనికోసం పూనమ్ కౌర్ ని సంప్రదించినట్లుతెలుస్తోంది. పవన్ తో పూనమ్ కి ఉన్న బంధం గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ఈ విషయంపై గతంలో కత్తి మహేష్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు మరోసారి ఈ విషయాన్ని పెద్దది చేయాలని అనుకుంటున్నారట. ఆ విధంగా పవన్ స్థాయిని తగ్గుతుందని భావిస్తున్నారు. దీనికోసం పూనమ్ కి పదిహేను కోట్లు ఆఫర్ కూడా చేశారట. పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడడం కోసం పూనమ్ కి ఇంత పెద్ద మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం.

సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, ఓ భారీ సీరియల్ లో నటిస్తోన్న పూనమ్ ఈ వివాదానికి దూరంగా ఉండాలని అనుకుంటోంది. అందుకే ఇంత పెద్ద డీల్ ఆఫర్ చేసినా కాదంటోందట. ఈ వివాదానికి పూర్తిగా దూరంగా ఉండాలని భావిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి!
 

PREV
click me!

Recommended Stories

Irumudi Day 2 Collections: రెండో రోజు ఇరుముడి కి దిమ్మతిరిగే కలెక్షన్లు, బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న రవితేజ మూవీ
Chiranjeevi Movie Remake: చిరంజీవి సూపర్ హిట్ మూవీ రీమేక్, ఆ కామెడీ హీరోకే సాధ్యం.. తేల్చేసిన రాంచరణ్, కానీ