స్టార్ హీరో కూతురు ప్రేమలో పడిందా..?

Published : Jan 22, 2019, 09:50 AM IST
స్టార్ హీరో కూతురు ప్రేమలో పడిందా..?

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా ఆలీఖాన్ 'కేదార్‌నాథ్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సుశాంత్ రాజ్ పుత్ హీరోగా నటించాడు. 

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా ఆలీఖాన్ 'కేదార్‌నాథ్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సుశాంత్ రాజ్ పుత్ హీరోగా నటించాడు. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. 

కొన్ని బోల్డ్ సీన్స్ లో సైతం కలిసి నటించారు. ఇప్పుడు నిజజీవితంలో కూడా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నడుస్తుందని బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది. నిన్న జరిగిన సుశాంత్ రాజ్ పుత్ పుట్టినరోజు వేడుకల కోసం సారా ఆలీఖాన్ డెహ్రాడూన్ నుండి వచ్చారు. సుశాంత్ కోసం ప్రత్యేకంగా కేక్ ను కూడా తీసుకొచ్చింది.

ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్ కి కూడా వెళ్లడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే వార్తలు గుప్పుమన్నాయి. సారాకి ప్రేమ వ్యవహారం కొత్తైనా.. సుశాంత్ కి మాత్రం కాదు. గతంలో టీవీ నటితో ప్రేమాయణం సాగించిన సుశాంత్ హీరోయిన్ కృతిసనన్ తో కూడా డేటింగ్ చేశాడు.

అయితే ఈ వ్యవహారాల గురించి మాత్రం ఎప్పుడూ కామెంట్ చేయలేదు. ఈసారి ఏకంగా స్టార్ హీరో కూతురితో ఎఫైర్ అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయం మీదైనా స్పందిస్తాడేమో చూడాలి. ప్రస్తుతం సుశాంత్ 'సోనా చిడియా' అనే సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

రాజాసాబ్ చేయకుండా తప్పించుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా? ప్రభాస్ ను బుక్ చేశారుగా
The Raja Saab 6 Days Collection: ది రాజాసాబ్‌కి ఆరో రోజు పెరిగిన కలెక్షన్లు.. ప్రభాస్‌ టార్గెట్‌కి ఎంత దూరంలో ఉన్నాడంటే