
దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తంగా వివాదం రాజేసిన విషయం తెలిసిందే. కాశ్మీర్ లో పండిట్స్ పై ముస్లిమ్స్ అరాచకాలు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. సమైక్యవాదులు, ముస్లిం వర్గాలు ఈ చిత్రాన్ని తప్పుబట్టాయి. ఇది బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం నిర్మించిన మూవీ. ప్రాపగాండా చిత్రం అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో ది కాశ్మీర్ ఫైల్స్ ప్రదర్శించగా జ్యూరీ హెడ్ నవద్ లాపిడ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
అధికార విపక్షాల మధ్య మాటల యుద్దానికి ది కాశ్మీర్ ఫైల్స్ దారితీసింది. ఇంతటి వివాదాస్పద చిత్రానికి జాతీయ అవార్డు ప్రకటించడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులోనూ జాతీయ ఐక్యత విభాగంలో ది కాశ్మీర్ ఫైల్స్ కి అవార్డు ప్రకటించారు. నర్గీస్ దత్ అవార్డు ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రిటీ విభాగంలో ది కాశ్మీర్ ఫైల్స్ జాతీయ అవార్డు అందుకుంది.
విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న ఈ చిత్రానికి జాతీయ సమైక్యత విభాగంలో అవార్డు ఇవ్వడం అసమ్మతం. ఇది జాతీయ సమైక్యతను దెబ్బతీయడం అవుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వేదికగా తన అసహనం ప్రకటించారు. స్టాలిన్ ట్వీట్ వైరల్ అవుతుంది. అదే సమయంలో జాతీయ అవార్డ్స్ గెలుచుకున్న వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అభినందించారు.
ఇక తెలుగు సినిమా ఈసారి దున్నేసింది. ఉత్తమ నటుడు వంటి అత్యున్నత పురస్కారంతో పాటు మొత్తంగా 11 జాతీయ అవార్డులు టాలీవుడ్ కి దక్కాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఏకంగా 6 అవార్డులు సొంతం చేసుకుంది. ఉప్పెన, కొండపొలం చిత్రాలకు అవార్డులు దక్కాయి.