త్వరలో విశాల్ పెళ్లి? వధువు ఈ యంగ్ హీరోయినేనా! వైరల్ న్యూస్..

By Asianet News  |  First Published Aug 8, 2023, 4:04 PM IST

తమిళ స్టార్ హీరో విశాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని.. యంగ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ తో ఫిక్స్ అయ్యిందని.. అది విశాల్ తోనే అంటూ న్యూస్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్ గా మారింది. 
 


తమిళ స్టార్ హీరో విశాల్ (Vishal)  గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించిన ఆయన అభిమానులనూ సంపాదించుకున్నారు. ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. స్టార్ హీరోగా ఎదిగారు. ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోనూ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. తమిళ ప్రజల్లో రియల్ హీరోగా నిలుస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. విశాల్ వయస్సు ప్రస్తుతం 45 ఏళ్లు.. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కరోనా లాక్ డౌన్ కు ముందుకు అనీషాతో విశాల్ నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. ఏమైందోగానీ వివాహం మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత నుంచి విశాల్ ఎక్కడ కనిపించినా అభిమానుల నుంచి, శ్రేయోభిలాషులను ఎదురయ్యే ప్రశ్న పెళ్లి ఎప్పుడు? ఇటీవల విశాల్ కు చాలా చోట్ల ఈ ప్రశ్న ఎదురైంది. కానీ తెలివిగా దాట వేస్తూ వచ్చారు. 

Latest Videos

తాజాగా కోలీవుడ్ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.  ఒకప్పటి స్టార్ హీరోయిన్ లక్ష్మీ మీనన్ (Lakshmi Menon) పెళ్లి పీటలు ఎక్కబోతోందని తెలుస్తోంది. త్వరలోనే పెళ్లి కూడా ఉంటుందని న్యూస్ వైరల్ గా మారింది. అయితే లక్ష్మీ మీనన్ చేసుకోబోయేది విశాల్ నే అని అంటున్నారు. వీరిద్దరూ కలిసి గతంలో ‘పాండియనాడు’,‘ఇంద్రుడు వంటి సిినమాల్లో నటించారు. వారిద్దరి పేయిర్ కు ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. మరోవైపు వారి మధ్యకూడా ప్రేమ చిగురించిందని అప్పట్లో టాక్ వినిపించింది. ఆ తర్వాత సైలెంట్ అయ్యింది.

కానీ అప్పటి నుంచే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా దాచారని అంటున్నారు.  ప్రస్తుతం వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇకపై విశాల్ గానీ, లక్ష్మీ మీనన్ గా స్పందిస్తేనే ఈ రూమర్లకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఇక లక్ష్మీ మీనన్ చాలా రోజుల తర్వాత ‘చంద్రముఖి2’తో వెండితెరపై మెరియనుంది. 

click me!