మీటూ: ఆమె ట్వీట్ చేసింది శింబు గురించేనా?

Published : Oct 22, 2018, 08:46 PM IST
మీటూ: ఆమె ట్వీట్ చేసింది శింబు గురించేనా?

సారాంశం

మీటూ ఉద్యమం వేడి అన్ని ఇండస్త్రీలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రోజుకో న్యూస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా బయటపడక తప్పదు అనే రేంజ్ లో సీన్స్ దర్శనమిస్తున్నాయి.

మీటూ ఉద్యమం వేడి అన్ని ఇండస్త్రీలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రోజుకో న్యూస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా బయటపడక తప్పదు అనే రేంజ్ లో సీన్స్ దర్శనమిస్తున్నాయి. గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను నటీమణులు దైర్యంగా బయటకి చెబుతున్నారు. 

దీంతో చాలా మంది సెలబ్రెటీలు తమ పేరు ఎక్కడ బయటపడుతుందో అని ఆందోళన చెందుతున్నట్లు కథనాలు కూడా వెలువడ్డాయి. అసలు విషయంలోకి వస్తే.. ఇప్పుడు కోలీవుడ్ లో శింబు పేరు కూడా ఈ వివాదంలో వినిపిస్తోంది.  తమిళ హీరోయిన్ లేఖ చేసిన ఒక ట్వీట్ కొత్త ఊహాగానాలకు తావిస్తోంది. వాషింగ్టన్ ట్విట్టర్ లో మీటూ హ్యాష్ ట్యాగ్ తో ఆమె కెట్టవన్ అంటూ ట్వీట్ చేసింది.

కెట్టవన్ అనేది శింబుతో లేఖ నటించిన సినిమా. దీంతో ఆమెను శింబు ఏమైనా వేధించాడా అని కోలీవుడ్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే వెంటనే ఈ విషయంపై శింబు ఆఫీస్ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. కెట్టవన్ షూటింగ్  సమయంలో ఎలాంటి సంఘటనలు జరగలేదని ఆమె ఎందుకు అలా చేసిందో తెలియదని చెబుతూ ఆమె క్లారిటీ ఇవ్వకుండా శింబు పేరుతో తప్పుడు కథనాలను వ్రాయడం కరెక్ట్ కాదని ప్రకటన ద్వారా తెలియజేశారు

PREV
click me!

Recommended Stories

హీరోయిన్ ని నిజంగానే కాలితో తన్నారా ? వెక్కి వెక్కి ఏడుస్తూ బయటకి.. ఎన్టీఆర్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్
1000 కోట్ల సినిమా ను ఒక ఫ్లాప్ మూవీ కోసం వదిలేసుకున్న నాగార్జున, కారణం ఏంటో తెలుసా?