Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు కోర్టులో ఊరట.. ఫారెన్ కారు టాక్స్ వివాదంలో దళపతి

Published : Jan 29, 2022, 07:41 AM IST
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు కోర్టులో ఊరట.. ఫారెన్ కారు టాక్స్ వివాదంలో  దళపతి

సారాంశం

తమిళనాట భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోలలో ఒకరు జోసెఫ్ విజయ్(Vijay). అలియాస్ దళపతి విజయ్. ఈ స్టార్ హీరో ఫారెన్ కారుకు టాక్స్ ఎగ్గొట్టిన వివాదంలో కోర్ట్  నుంచి ఊరట లభించింది.

తమిళనాట భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోలలో ఒకరు జోసెఫ్ విజయ్(Vijay). అలియాస్ దళపతి విజయ్. ఈ స్టార్ హీరో ఫారెన్ కారుకు టాక్స్ ఎగ్గొట్టిన వివాదంలో కోర్ట్  నుంచి ఊరట లభించింది.

కోలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరైన జోసెఫ్‌ విజయ్‌ చంద్రశేఖర్‌ అలియాస్ దళపతి విజయ్‌ (Vijay) కు కోర్డ్ నుంచి ఊరట లబించింది. గతంలో విజయ్ ఇంగ్లండ్‌ నుంచి దిగుమతి చేసుకున్న లగ్జరీకారు రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌కు ఎంట్రీ పన్ను ఎగ్గొట్టారు. దాంతో అక్కడి వాణిజ్య పన్నుల శాఖ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎంట్రీట్యాక్స్‌ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేస్తూ నటులు ఇలా పన్ను ఎగవేతకు పాల్పడడం సమంజసం కాదంటూ వ్యాఖ్యలు చేశారు. దాంతో పన్ను మినహాయింపు కోరుతూ.. హీరో విజయ్(Vijay) ఫిటీషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది.  

సమాజంలో పేరు ప్రఖ్యాతలు కలిగిన హీరో అయిన పిటిషనర్‌ వెంటనే తన లగ్జరీ కారుకు సంబంధించిన ట్యాక్స్‌ కట్టాలని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పుడే ఆయన అభిమానులు నిజమైన హీరో అవుతారన్నారు. తమిళనాడులో ఎందరో హీరోలు పాలకులుగా మారారని, ప్రజలు వారిని నిజమైన హీరోలుగా పరిగణిస్తారని న్యాయస్థానం పేర్కొంది.

అలాంటి వారిని రీల్‌ హీరోలుగా ఊహించుకునేలా ప్రవర్తించవద్దని న్యాయమూర్తి హీరో విజయ్‌(Vijay) కు సూచించారు. పన‌్న ఎగవేత జాతి వ్యతిరేక అలవాటే కాక రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. తాము సామాజిక న్యాయం కోసం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే యోధులమని హీరోలు చెప్పుకుంటారని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాంటి వారు పన్ను ఎగవేతకు పాల్పడటం చట్ట ప్రకారం సరైన చర్య కాదన్నారు.

మినహాయింపు కోరుతూ హీరో విజయ్‌(Vijay)  దాఖలు చేసిన పిటిషన్‌ను అప్పుడు ధర్మాసనం కొట్టివేసింది. లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ మేరకు జరినామా మొత్తాన్ని తమిళనాడు సీఎం కరోనా రిలీఫ్‌ ఫండ్‌కు జమ చేయాలని విజయ్‌ని ఆదేశించారు. దీంతో  విజయ్‌(Vijay)  ఎంట్రీట్యాక్స్‌ చెల్లించారు.

అయితే ప్రత్యేకన్యాయమూర్తి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను రద్దు చేయాలంటూ విజయ్‌(Vijay)  కోర్టులో మరో  పిటిషన్‌ వేశారు. ఈకేసు విచారణ శుక్రవారం జరిగింది. ప్రత్యేక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా న్యాయస్తానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ మళ్శీ మంగళవారానికి వాయిదా వేశారు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్