తమన్నాకి ఇది పెద్ద దెబ్బే!

Published : Jun 17, 2019, 10:06 AM IST
తమన్నాకి ఇది పెద్ద దెబ్బే!

సారాంశం

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన తమన్నాకి ఎప్పటికైనా బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకోవాలని కల. 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన తమన్నాకి ఎప్పటికైనా బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకోవాలని కల. అందుకే బాలీవుడ్ నుండి చిన్న అవకాశం వచ్చినా వదులుకోదు. కానీ అక్కడ ఆమె సక్సెస్ మాత్రం కాలేకపోతుంది.

తాజాగా మరోసారి ఓ ఫ్లాప్ సినిమాలో నటించి డీలా పడింది. గతంలో అజయ్ దేవగన్ తో 'హిమ్మత్ వాలా' సినిమా చేసి ఫ్లాప్ అందుకున్న ఈమె మధ్యలో 'ఎంటర్టైన్మెంట్' సినిమాలో నటించింది. ఇది ఒక మోస్తరుగా ఆడినా తమన్నా కెరీర్ కి ఎంతమాత్రం కలిసిరాలేదు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తరువాత హిందీలో ప్రభుదేవాతో కలిసి 'ఖామోషీ' సినిమాలో నటించింది.

గతవారం విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేకపోయినా.. తమన్నా మాత్రం ఈ సినిమాపై ఆశలు పెట్టుకుంది. అయితే మొదటిరోజే ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. కనీసం వీకెండ్ లో పుంజుకుంటుందేమోనని ఎదురుచూశారు. అయితే శని, ఆదివారాలు కూడా సినిమా గట్టెక్కలేకపోయింది. పైగా ఆదివారం నాడు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ప్రభావం కూడా ఈ సినిమాపై పడడంతో విడుదలైన మూడు రోజులకే ఈ సినిమాను థియేటర్ నుండి తీసేస్తున్నాడు. 

ఇది తమన్నాకి కోలుకోలేని దెబ్బనే చెప్పాలి. ఈ సినిమాతో సక్సెస్ అందుకొని బాలీవుడ్ లో బిజీ అవ్వాలనుకున్న ఆమె ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు!

PREV
click me!

Recommended Stories

Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే
Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?