ఆ ప్రశ్నలతో విసిగిపోయిన తమన్నా!

Published : Jul 09, 2019, 02:22 PM ISTUpdated : Jul 09, 2019, 02:36 PM IST
ఆ ప్రశ్నలతో విసిగిపోయిన తమన్నా!

సారాంశం

దక్షిణాది టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నాఇటీవల ముంబైలోని వర్సోవా ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ ను రెట్టింపు ధరకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది.

దక్షిణాది టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నాఇటీవల ముంబైలోని వర్సోవా ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ ను రెట్టింపు ధరకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. సముద్రతీరాన ఉన్న ఆ ఇంటిని దాదాపు రూ.16 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తమన్నా కొన్నట్లు తెలిసింది.

ఆ ప్రాంతంలో ఉన్న ధర కంటే రెట్టింపు మొత్తం ఇచ్చి తనకు ఇష్టమైన ఇంటిని సొంతం చేసుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా ఈ బ్యూటీ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది. తన హిందీ టీచర్ ఇల్లు కొన్నావా..? అని మెసేజ్ చేశారని.. రెట్టింపు ధరకి నేనెందుకు కొంటానని టీచర్ కి చెప్పినట్లు వెల్లడించింది.

అయినప్పటికీ తమన్నాకి ఇంటి గురించి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. దీంతో ఆమె తన సహనాన్ని కోల్పోయింది. చాలా రోజులు అయినప్పటికీ ప్రజలు ఇదే ప్రశ్న అడుగుతుంటే తనకు విసుగొస్తోందని.. ఇల్లు కొన్న మాట నిజమే కానీ రెట్టింపు ధరకు మాత్రం కొనలేదని క్లారిటీ ఇచ్చింది. 

ఇంటి పనులు పూర్తయిన తరువాత తన తల్లితండ్రులతో కలిసి అక్కడకి షిఫ్ట్ అవుతానని చెప్పింది. తనకు సింపుల్ గా జీవించడమే  ఇష్టమని వెల్లడించింది. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. తెలుగులో 'సై రా', 'దటీజ్ మహాలక్ష్మి' సినిమాలతో పాటు తమిళంలో రెండు సినిమాలు సైన్ చేసింది.    

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి