ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హిజ్రా!

Published : Jul 29, 2019, 09:38 AM IST
ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హిజ్రా!

సారాంశం

కిచెన్‌లో అందరితోనూ గొడవ పెట్టుకున్న హేమను మొత్తానికి ఎలిమినేట్ చేసేశారు. ప్రేక్షకులతో పాటు హౌజ్‌మేట్స్ కూడా హేమనే ఎలిమినేట్ కావాలని ఓటేయడం విశేషం.

బిగ్ బాస్ సీజన్ 3 మొదలై ఆదివారం నాటికి వారం రోజులు పూర్తయింది. తొలివారంలో ఎలిమినేట్ అయిన కంటెస్టంట్ నటి హేమ. మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో మొదటి ఎలిమినేషన్ కి ఆరుగురు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. పోటీదారులు హౌస్ లోకి అడుగుపెట్టిన రెండో రోజే రాహుల్, పునర్నవి, వితికా, జాఫర్, హేమలను ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

ఐదు రోజుల పాటు ఈ ఆరుగురు ఎలిమినేషన్ టెన్షన్ తో గడిపారు. ఫైనల్ గా శనివారం నాడు మన టీవీ ద్వారా కంటెస్టంట్ లను పలకరించిన హోస్ట్ అక్కినేని నాగార్జున.. నామినేట్ అయిన ఆరుగురిలో హిమజ, పునర్నవి సేఫ్ జోన్ లోకి వెళ్లడంతో షో ముగిసింది. ఇక ఆదివారం నాడు ఎంట్రీ ఇచ్చిన నాగార్జున కాసేపు కంటెస్టంట్లతో మాట్లాడి హేమ ఎలిమినేట్ అయిన విషయాన్ని ప్రకటించారు.

ఇది ఇలా ఉండగా.. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో ఓ కంటెస్టంట్ ని ఎంపిక చేసుకొని షాక్ ఇచ్చారు. ఇంతకీ ఆమె ఎవరంటే.. ప్రముఖ ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి. ఆమెని 15వ కంటెస్టంట్ గా నాగార్జున పరిచయం చేశారు. ఆ తరువాత మైక్ తీసుకున్న తమన్నా తన కల నెరవేరిందని చెప్పారు. ట్రాన్స్‌జెండర్ ను అయినా తనకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ చెప్పారు.

తానేంటో నిరూపించుకుంటానని.. హౌస్ లో చివరి వరకు ఉంటానని చెప్పారు. బయటకి వచ్చిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తన కుటుంబం చేసుకుంటానని నమ్మకంగా చెప్పారు. ప్రస్తుతం తమన్నాని హౌస్ లోకి పంపలేదు. బిగ్ బాస్ చెప్పినప్పుడు హౌస్ లోకి వెళ్లాలని, అప్పటివరకు ఎదురు చూడాలని నాగార్జున.. తమన్నాకి చెప్పారు.

బిగ్ బాస్3 నుంచి హేమ ఎలిమినేట్.. అందరూ ఆమెకే వ్యతిరేకంగా!

PREV
click me!

Recommended Stories

Funky First Review: `ఫంకీ` మూవీ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లో నవ్వుల సునామీ.. కానీ మైనస్‌ ఏంటంటే?
బాహుబలిని డామినేట్ చేసిన 70 ఏళ్ళ నాటి సినిమా.. జనాలు ఎప్పుడో మరచిపోయారు అంటూ రాజమౌళిపై కామెంట్స్