వెంకీకి ఫ్రస్టేషన్‌ తెప్పించేందుకు ఎంటరైన తమన్నా ఫ్యామిలీ.. ఆమె చీరకట్టుకి వాహ్‌ అనాల్సిందే..

Published : Feb 01, 2021, 07:28 PM IST
వెంకీకి ఫ్రస్టేషన్‌ తెప్పించేందుకు ఎంటరైన తమన్నా ఫ్యామిలీ.. ఆమె చీరకట్టుకి వాహ్‌ అనాల్సిందే..

సారాంశం

విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌ ల కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌గా వస్తోన్న చిత్రం `ఎఫ్‌3`. రెండేళ్ల క్రితం వచ్చి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన `ఎఫ్‌2`కిది సీక్వెల్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది.  తాజాగా తమన్నా, ప్రగతి, రఘుబాబు, అన్నపూర్ణ, విజయ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు.  

వెంకీ ఫ్యామిలీ కలిసి కట్టుగా సెట్‌కి వచ్చారు. సెట్‌లో వెంకీకి ఫ్రస్టేషన్‌ ఏంటో చూపించారు. ముఖ్యంగా తన భార్య తాలుకు వాళ్లు చేసిన రచ్చకి వెంకీకి ఫ్రస్టేషన్‌ వచ్చేసింది. దీంతో వెంకీ ఆసనాలు వేయడం ప్రారంభించాడు. ఇది వింటుంటూ ఎక్కడో కనెక్షన్‌ గుర్తొస్తుంది కాదు. అవుతున్న మీరు ఊహించే కనెక్షన్‌ నిజమే. ఇదంతా `ఎఫ్‌3` సినిమా షూటింగ్‌లో జరిగిన సన్నివేశాలు. విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌ ల కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌గా వస్తోన్న చిత్రం `ఎఫ్‌3`. రెండేళ్ల క్రితం వచ్చి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన `ఎఫ్‌2`కిది సీక్వెల్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. 

ఇప్పటికే వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. తాజాగా తమన్నా, సీనియర్‌ నటీమణులు అన్నపూర్ణమ్మ, విజయ, ప్రగతి, రఘుబాబు తదితరులు సోమవారం షూట్‌ లో పాల్గొని సందడి చేశారు. వెంకటేష్‌తో కలిసి దిగిన ఫోటో ఆకట్టుకుంటుంది. వెంకీకి భార్యగా తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. తమన్నా ఫ్యామిలీగా వీరంతా కనిపిస్తారు. దీంతో ఇప్పుడు వెంకీ ఫ్యామిలీ `ఎఫ్‌3`లో హంగామా చేస్తుందని చెప్పొచ్చు. ఇందులో తమన్నా చీరకట్టులో కొత్తగా కనిపిస్తుంది. ఈ ఫోటోని పంచుకుంటూ ఫన్‌ రైడ్‌ మళ్లీ మొదలైందని అనిల్‌ రావిపూడి ట్వీట్టర్‌ ద్వారా తెలిపారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా డబ్బు చుట్టూ నెలకొన్న ఫన్‌, ఫ్రస్టేషన్‌ ప్రధానంగా సాగుతుందని తెలుస్తుంది. వరుణ్‌ తేజ్‌కి మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఆగస్ట్ 27న విడుదల చేయనున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌