కృష్ణుడు కౌరవుల వైపు నిలబడితే.. యుద్ధం లేకుండా మహాభారతాన్ని చూస్తే?

Published : Feb 01, 2021, 05:57 PM IST
కృష్ణుడు కౌరవుల వైపు నిలబడితే.. యుద్ధం లేకుండా మహాభారతాన్ని చూస్తే?

సారాంశం

కార్తీ హీరోగా బక్కియ రాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `సుల్తాన్‌`. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. ఇందులో `కేజీఎఫ్‌` విలన్‌ గరుడ పాత్ర ధారి కూడా నటిస్తుండటం వివేషం. తాజాగా విడుదలైన టీజర్‌ బాగా ఆకట్టుకోవడంతోపాటు అంచనాలను పెంచుతుంది.

`మహాభారతం చదివావా.. భారతంలో కృష్ణుడు వంద అవకాశాలిచ్చాన కౌరవులు మారలేదు. నువ్వు ఇవ్వమంటుంది ఒక్క అవకాశమే కాదా ఇస్తా` అని విలన్లు అంటే `మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు నిల్చున్నాడు. అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే..అదే మహాభారతాన్ని ఒక్కసారి యుద్ధం లేకుండా ఊహించుకోండి సర్` అని హీరో కార్తీ అంటున్నాడు. ఇది ఆయన నటిస్తున్న `సుల్తాన్‌` చిత్ర టీజర్‌లోని డైలాగులు. 

బక్కియ రాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `సుల్తాన్‌`. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. ఇందులో `కేజీఎఫ్‌` విలన్‌ గరుడ పాత్ర ధారి కూడా నటిస్తుండటం వివేషం. తాజాగా విడుదలైన టీజర్‌ బాగా ఆకట్టుకోవడంతోపాటు అంచనాలను పెంచుతుంది. `మహాభారతం` రివర్స్ లో ఈ సినిమా కథ సాగుతుందని తాజాగా టీజర్‌లోని డైలాగులను వింటే అర్థమవుతుంది. చాలా ఆసక్తికరంగా సాగిందీ టీజర్‌. భయంకరమైన విలన్లు, స్టయిలీష్‌గా కార్తీ ఎంట్రీ హైలైట్‌గా నిలిచాయి. రష్మిక మందన్నా కూడా ఆకట్టుకునేలా ఉంది.

ఇక డ్రీమ్స్ వాయిర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ ఆర్‌ప్రకాష్‌ బాబు, ఎస్‌ ఆర్‌ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 2న విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళంలో విడుదల కానున్నట్టు తెలుస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌