సల్మాన్ ఖాన్ తో టాలెంటెడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సినిమా.! స్క్రిప్ట్ ఆల్ మోస్ట్ రెడీ!

Published : May 16, 2022, 04:03 PM IST
సల్మాన్ ఖాన్ తో టాలెంటెడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సినిమా.! స్క్రిప్ట్ ఆల్ మోస్ట్ రెడీ!

సారాంశం

టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను ఒకే  చేయించినట్టు తెలుస్తోంది.  

టాలెంటెడ్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) బాలీవుడ్ స్టార్స్ పై గురిపెట్టినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలను అందించిన హరీశ్ చివరిగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో ‘భవదీయుడు భగత్  సింగ్’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే గత మూడేండ్లుగా హరీశ్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. 

దీంతో ప్రస్తుతం వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సారి ఏకంగా బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేందుకు పక్కా ప్లాన్ వేశారంట హరీశ్. ఈ సందర్భంగా బీటౌన్ లో క్రేజీ బజ్ క్రియేట్ అయ్యింది. బాలీవుడ్ బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తో  ఓ భారీ చిత్రాన్ని రూపొందించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం హరీశ్ సినిమాకు సంబంధించిన బేసిక్ ఐడియాను సల్మాన్ కు తెలియజేశారంట. సల్లూ బాయ్ ఒకే చేస్తే వెంటనే స్క్రిప్ట్ వర్క్ స్టార్ కానున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

అయితే సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్’ చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో  హరీశ్ దర్శకత్వంలో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.  2010లో  రిలీజ్ అయిన దబాంగ్, 2012లో రిలీజ్ అయిన ‘గబ్బర్ సింగ్’ రెండూ ఘన విజయం సాధించాయి. అప్పటి నుంచే సల్లూబాయ్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారంట హరీశ్ శంకర్. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ కు సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. హరీశ్ శంకర్ కూడా ఈ సెట్స్ లో చాలా సార్లు కనిపించారు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ తో సినిమా గురించి మాట్లాడి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

కాగా ప్రస్తుతం హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం Bhavadheeyudu Bhagat Singh ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అయితే సల్లూబాయ్ తో అన్నీ సెట్ అయితే.. ఈ చిత్రాన్నే డైరెక్టర్ చేయనున్నారని కూడా సమాచారం. ఈ కాంబినేషన్ లో సినిమా ఒకే అయితే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3, పటాన్, కభీ ఈద్ కభీ దివాళి’ చిత్రాల్లో నటిస్తున్నారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌