క్రేజీ తాప్సి... థ్రిల్ కోసం బాత్ టబ్ లో ఫోటోలు దిగాను అంటుంది!

By team teluguFirst Published Jan 15, 2021, 2:23 PM IST
Highlights

కొత్తగా ఉంటుందని బాత్ టబ్ లో ఫొటోలు ట్రై చేశా... చూద్దాం ఎంత థ్రిల్ గా ఉంటుందో అంటూ కామెంట్ పెట్టింది తాప్సి. బాత్ టబ్ లో తాప్సి లుక్ సెక్సీగా ఉండగా, ముఖ్యంగా ఆమె కర్లీ హెయిర్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. దీనితో తాప్సి ఫోటోపై ఆమె ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పుర్రెకో బుద్ధి అన్నట్లు... ఒక్కొక్కరి మెదడుకు ఒక్కొక్క ఆలోచన వస్తూ ఉంటుంది. జీవితాన్ని కొంచెం భిన్నంగా ఆస్వాదించాలి అనుకొనే వారి ఆలోచనలు, ఇంకొంచెం కొత్తగా ఉంటాయి. హీరోయిన్ తాప్సి కూడా లైఫ్ లో కొంచెం థ్రిల్ కావాలని కోరుకుంటుంది. అందుకే సంథింగ్ డిఫరెంట్ ట్రై చేస్తున్నా అంటుంది. సాధారణంగా ఎవరికైనా ఫోటో దిగాలని అనిపిస్తే మంచి గార్డెన్ ఏరియా లేదా హాల్ లేదా మంచి ప్రకృతి వనం ఎంచుకుంటారు. కానీ తాప్సి ఫోటో దిగడానికి బాత్ టబ్ సెలెక్ట్ చేసుకుంది. 

కొత్తగా ఉంటుందని బాత్ టబ్ లో ఫొటోలు ట్రై చేశా... చూద్దాం ఎంత థ్రిల్ గా ఉంటుందో అంటూ కామెంట్ పెట్టింది. బాత్ టబ్ లో తాప్సి లుక్ సెక్సీగా ఉండగా, ముఖ్యంగా ఆమె కర్లీ హెయిర్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. దీనితో తాప్సి ఫోటోపై ఆమె ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాప్సి కి క్లోజ్ ఫ్రెండ్ అయిన మంచు లక్ష్మీ కూడా తాప్సి ఫోటోపై స్పందించారు. ఆ హెయిర్ ని మిస్ అవుతున్నానంటూ ఆమె కామెంట్ చేశారు. 

ఇక బాలీవుడ్ లో వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది తాప్సి. ప్రస్తుతం ఆమె రష్మీ రాకెట్ పేరుతో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. రష్మీ రాకెట్ మూవీలో తాప్సి ప్రొఫెషనల్ రన్నర్ గా కనిపించనున్నారు. ఈ మూవీ కోసం కఠినమైన కసరత్తులు చేసిన తాప్సి, సదరు వీడియోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. హిందీ, తమిళంలో కలిపి తాప్సి దాదాపు అరడజను సినిమాలతో బిజీగా ఉంది. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taapsee Pannu (@taapsee)

click me!