అక్క కాపీ కామెంట్స్.. రెచ్చిపోయిన తాప్సి!

Published : Aug 15, 2019, 06:19 PM IST
అక్క కాపీ కామెంట్స్.. రెచ్చిపోయిన తాప్సి!

సారాంశం

కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ చేసిన తాప్సి ప్రస్తుతం విభిన్న చిత్రాలతో దూసుకుపోతోంది. బాలీవుడ్ లో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. తాప్సి నటించిన 'మిషన్ మంగళ్' చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రంలో విద్యా బాలన్, నిత్యామీనన్, తాప్సి, సోనాక్షి సిన్హా కీలక పాత్రల్లో నటించారు. 

తాప్సి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివాదాల రాణి కంగనాకు కౌంటర్ ఇచ్చింది. గతంలో కంగనా, ఆమె సోదరి రంగోలి తాప్సిని విమర్శించారు. తన చిత్రాలకు బాలీవుడ్ ప్రముఖులు ఎవరూ మద్దతు తెలపడం లేదని కంగన ఆరోపించిన సంగతి తెలిసిందే. తాను మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించినా హీరోయిన్లు ఎవరూ అభినందించలేదని కంగనా ఆరోపించింది. 

ఇక రంగోలి ఓ సందర్భంలో మాట్లాడుతూ తాప్సి తన సోదరి కంగనాని కాపీ కొడుతోందని విమర్శించింది. ఈ వ్యాఖ్యలకు తాప్సి తాజాగా కౌంటర్ ఇచ్చింది. మిషన్ మంగళ్ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లం నటించాం. అంటే ఇది కూడా మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రమే. ఈ చిత్రానికి కంగనా ఎందుకు అభినందనలు తెలపలేదు. 

కంగనాకు ఉన్న సినిమా నాలెడ్జ్ నాకు లేదు.. కానీ ఇటీవల నేను మంచి చిత్రాల్లో నటించా. అయినా ఆమె స్పందించలేదు అంటూ తాప్సి సెటైర్లు వేసింది. నేను కంగనాని కాపీ కొడుతున్నానని ఆమె సోదరి కామెంట్ చేసింది. ఆ వ్యాఖ్యలకు తాను చాలా బాధపడ్డా అని తాప్సి తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Ram Charan: రాంచరణ్- జాన్వీ కపూర్ నుంచి కార్తీక్ - శ్రీలీల వరకు.. 2026లో రాబోయే క్రేజీ జంటలు
Hero Karthik: ఆ అలవాటు వల్ల కెరీర్ లో పతనం.. అన్వేషణ హీరో కార్తీక్ ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితి ఏంటి ?