నెటిజన్ కు ఘాటుగా బదులిచ్చిన తాప్సీ!

Published : Jul 08, 2019, 03:48 PM IST
నెటిజన్ కు ఘాటుగా బదులిచ్చిన తాప్సీ!

సారాంశం

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. 

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇటీవల 'గేమ్ ఓవర్' చిత్రంతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ మరో సినిమా సైన్ చేసింది.

దర్శకుడు అనుభవ్ సిన్హాతో సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇలాంటి సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని, ఇప్పుడు ఆ కల నెరవేరబోతుందని చెబుతూ ఆ దర్శకుడితో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకొంది.

ఈ పోస్ట్ చూసిన ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. 'అభినవ్ సర్.. మీరు సినిమాలో తాప్సికి బదులు మరో నటిని ఎన్నుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.. తాప్సికి అసలు నటించడమే రాదు' అని అన్నాడు.

ఇది చూసిన తాప్సి.. 'సారీ యార్.. ఇప్పుడేం చేయలేవ్.. ఎందుకంటే సినిమాకు ఆల్రెడీ సైన్ చేసేశాను. ఇప్పుడు అనుభవ్ సర్ నన్ను తీసేయాలని నిర్ణయించుకున్నా.. అది నేను జరగనివ్వను.. ఒక పని చెయ్.. నేను మరో సినిమాకు సైన్ చేసేలోపు ఆ సినిమాలో నన్ను ఎవరూ తీసుకోకుండా ఆపి చూడు' అని సవాల్ విసిరింది. 

 

PREV
click me!

Recommended Stories

Raviteja: బాలయ్య, రవితేజ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఇదే.. పరుచూరి బ్రదర్స్ చేసిన మోసం
Rakul Preet Singh IT Raid: రకుల్ ప్రీత్ సింగ్, వాసు భగ్నానీ ఇళ్లపై ఐటీ దాడులు.. దృశ్యం 3 నిర్మాణ సంస్థపై కూడా