అమ్మాయిగా పుట్టడమే నేను చేసిన అనుకరణ... కంగనాకు తాప్సీ కౌంటర్!

By team teluguFirst Published Jul 17, 2021, 12:30 PM IST
Highlights

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ కంగానా ను టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొందరు నేను తుమ్మినా కూడా దాన్ని విషయం చేస్తున్నారని, నా వ్యక్తిగత విషయాలతో వాళ్లకు ఏమి అవసరం అన్నారు. 

బాలీవుడ్ తారలు తాప్సీ పన్ను, కంగానా రానౌత్ మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ నడుస్తూ ఉంటుంది. వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలపై విమర్శల దాడి చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు కంగానా బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కంగానా కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆమె జోరు తగ్గగా, తాప్సీ ఆ స్థానం ఆక్రమించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ కంగానా ను టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొందరు నేను తుమ్మినా కూడా దాన్ని విషయం చేస్తున్నారని, నా వ్యక్తిగత విషయాలతో వాళ్లకు ఏమి అవసరం అన్నారు. ఇక నేను ఎవరినో కాపీ చేస్తున్నాను అంటారు. అమ్మాయిగా పుట్టడమే నేను చేసిన కాపీ అని భావిస్తున్నానని కంగానా రానౌత్ తెలిపారు.

తాప్సీ కొన్ని విషయాలలో తనను కాపీ చేస్తున్నారని కంగానా చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. మరి తాప్సీ కామెంట్స్ కి కంగాన ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. తాప్సి లేటెస్ట్ మూవీ హసీన్ దిల్ రుబా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కావడం జరిగింది. ఇక రష్మీ రాకెట్ మూవీలో ఆమె అథ్లెట్ గా కనిపించునున్నారు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం.

 

click me!