హీరోయిన్ ఆ సీన్ లో కనిపించేసరికి.. అభిమానులకు షాక్!

Published : Jun 04, 2018, 02:42 PM IST
హీరోయిన్ ఆ సీన్ లో కనిపించేసరికి.. అభిమానులకు షాక్!

సారాంశం

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ నటించిన 'వీరే ది వెడ్డింగ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ నటించిన 'వీరే ది వెడ్డింగ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్వరా భాస్కర్ తో పాటు సోనమ్ కపూర్, కరీనా కపూర్ లాంటి హీరోయిన్లు నటించారు. స్నేహితురాలి పెళ్లి కోసం కలుసుకున్న స్నేహితులు తమ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన కథను బోల్డ్ గా చూపించిన చిత్రమే ఈ సినిమా. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో స్వరా భాస్కర్ స్వయంతృప్తి పొందుతూ కనిపిస్తుంది.

లైంగిక సంతృప్తి కోసం ఆమె వైబ్రేటర్ ను వినియోగిస్తుంది. ఇప్పుడు ఈ సీన్ లో నటించినందుకు సోషల్ మీడియా వేదికగా ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. హిందూ అతివాదులు ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఇంట్లో వారితో సినిమాకు వెళ్లి ఆ సీన్ చూడలేక థియేటర్ నుండి బయటకు వచ్చేశామని ట్వీట్ చేయగా మరికొందరు స్వరా భాస్కర్ ను సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

వీటిపై స్పందించిన స్వరా భాస్కర్.. ''కొందమంది డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. వాళ్లు సినిమా చూడడానికి  ఇలాంటి ట్వీట్స్ పెట్టడానికి కచ్చితంగా డబ్బులు తీసుకునే ఉంటారు'' అంటూ కామెంట్ చేసింది.  

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే