జగన్ కు మద్దతు పలికిన సీనియర్ డైరెక్టర్

Published : Mar 31, 2019, 01:02 PM IST
జగన్ కు మద్దతు పలికిన సీనియర్ డైరెక్టర్

సారాంశం

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఎస్వీ.కృష్ణ రెడ్డి నిర్మాత కె. అచ్చిరెడ్డి జగన్ కు మద్దతు పలుకుతూ పలు విషయాలపై స్పందించారు.

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఎస్వీ.కృష్ణ రెడ్డి నిర్మాత కె. అచ్చిరెడ్డి జగన్ కు మద్దతు పలుకుతూ పలు విషయాలపై స్పందించారు. హైదరాబద్ వైఎస్సార్ సిపి కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగన్ నడుస్తోన్న దారిపై వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని అప్పుడే ప్రజలకు మంచి జరుగుతుందని మాట్లాడారు. 

ఎస్వీ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రజలకోసం పడుతోన్న తప్ప ఎంతగానో కదిలించింది. పాదయాత్ర ద్వారా జనాలను ఆయన అర్ధం చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. జనల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఆయన వ్యవహరిస్తున్న తీరుకి హర్షిస్తున్నాం. ప్రజలతో కలిసి వారికి నవరత్నాలు ప్రకటించారు. 

జగన్ లాంటి మంచి వ్యక్తి అధికారంలోకి వస్తే ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది.ఆయనే రాష్ట్రానికి సీఎం కావాలని అందుకు ప్రజలు ఆయనకు ఓటు వేసి గెలిపించాలని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెలియజేశారు. 

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌