సుశాంత్‌ ఫ్రెండ్‌పై ఫ్యామిలీ ఫైర్‌.. మృతిని రాజకీయం చేయొద్దు!

By Satish ReddyFirst Published Jul 1, 2020, 10:26 AM IST
Highlights

సుశాంత్ కుటుంబ సభ్యులను కలిసి తరువాత శేఖర్ సుమన్‌ ఆర్జేడీ చీఫ్‌ తేజస్వీ యాదవ్‌తో కలిసి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలను లేవనెత్తాడు. అంతేకాదు సుశాంత్ మృతిపై సీబీఐ ఎంక్వయిరీ జరపాలని డిమాండ్‌ చేశాడు శేఖర్‌ సుమన్

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతికి సంబంధించిన ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సుశాంత్ మరణించి 15 రోజులు గడుస్తున్నా ఏదో ఒక వివాదం తెర మీదకు వస్తూనే ఉంది. సుశాంత్ మృతితో షాక్ అయిన ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. పలువురు సినీ తారలు సుశాంత్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శిస్తున్నారు. తాజాగా శేఖర్‌ సుమన్‌ పాట్నాలోని సుశాంత్‌ ఇంటిని వెళ్లి దివంగత నటుడికి నివాళి అర్పించారు.

అయితే సుశాంత్ కుటుంబ సభ్యులను కలిసి తరువాత శేఖర్ సుమన్‌ ఆర్జేడీ చీఫ్‌ తేజస్వీ యాదవ్‌తో కలిసి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలను లేవనెత్తాడు. అంతేకాదు సుశాంత్ మృతిపై సీబీఐ ఎంక్వయిరీ జరపాలని డిమాండ్‌ చేశాడు శేఖర్‌ సుమన్. అయితే ఈ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌పై సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

సుశాంత్‌ మృతిని రాజకీయ అవసరాల కోసం వినియోగించుకోవద్దన్నారు కుటుంబ సభ్యులు. గత ఎన్నికల్లో శేఖర్ సుమన్‌ కాంగ్రెస్‌ తరుపున బీహార్‌లో పోటి చేశాడు, తరువాత ఆర్జేడీ పార్టీలో చేరాడు. అయితే శేఖర్‌ సుమన్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌ సుశాంత్ స్నేహితుడు సందీప్‌ సింగ్‌కు పాల్గోనటంపై కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం సుశాంత్ మృతికి సంబంధించిన విసయంపై ముంబై పోలీసులు ఇన్వెస్టిగేషన్‌  చేస్తున్నారు. అయితే ఈ సమయంలో ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని కోరారు సుశాంత్ కుటుంబ సభ్యులు.

click me!