సుశాంత్‌ గంజాయి తీసుకునేవాడు.. మరో షాకింగ్‌ విషయం వెల్లడి

Published : Aug 23, 2020, 06:18 PM ISTUpdated : Aug 23, 2020, 10:14 PM IST
సుశాంత్‌ గంజాయి తీసుకునేవాడు.. మరో షాకింగ్‌ విషయం వెల్లడి

సారాంశం

సుశాంత్‌ ఇంట్లో పనిచేసిన నీరజ్‌ సింగ్‌ అనే వ్యక్తి సుశాంత్‌ గురించి సంచలన విషయాలను తెలిపాడు. తాజాగా ముంబయి పోలీసుల విచారణలో భాగంగా సుశాంత్‌ గంజాయి  తీసుకునేవాడని నీరజ్‌ సింగ్‌ వెల్లడించినట్టు జాతీయ మీడియా రాసుకొచ్చింది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు అనేక మలుపులతో సాగుతుంది. తీగ లాగితే డొంక కదిలినట్టు అనేక సంచలన విషయాలు, కొత్త విషయాలు బయటపడుతున్నాయి. సుశాంత్‌ది ఆత్మహత్య కాదు, హత్య అనే ఆరోపణలు వస్తున్నాయి. లేదు లేదు సుశాంత్‌ ఆత్మహత్యే చేసుకున్నాడని ఆయన వంటమనిషి చెప్పాడు. తాజాగా మరో పని మనిషి మరో కొత్త విషయాన్ని వెల్లడించాడు. 

సుశాంత్‌ ఇంట్లో పనిచేసిన నీరజ్‌ సింగ్‌ అనే వ్యక్తి సుశాంత్‌ గురించి సంచలన విషయాలను తెలిపాడు. తాజాగా ముంబయి పోలీసుల విచారణలో భాగంగా సుశాంత్‌ గంజాయి  తీసుకునేవాడని నీరజ్‌ సింగ్‌ వెల్లడించినట్టు జాతీయ మీడియా రాసుకొచ్చింది. సుశాంత్‌ తరచూ గంజాయితో నింపిన సిగరెట్లని తాగేవాడని వెల్లడించినట్టు మీడియా ప్రసారం చేస్తుంది. 

ఇందులో నీరజ్‌ చెబుతూ, సుశాంత్‌ సర్‌ తన ఇంట్లో వారానికి రెండుసార్లు పార్టీ చేసుకునేవాడు. మద్యం, గంజాయితో నిండిన సిగరెట్లని వాడేవారని తెలిపారు. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడానికి రెండు రోజుల ముందు తాను ఆయనకు గంజాయితో కూడిన సిగరెట్ పెట్టెలను ఇచ్చానని వెల్లడించాడు. ఆయన చనిపోయిన తర్వాత చూస్తే ఖాళీ పెట్టేలు కనిపించాయని చెప్పాడు. దీంతో ఈ కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కోణంలోనూ విచారణ చేపట్టాల్సి ఉందని పోలీసులు భావిస్తున్నారు. 

మరోవైపు ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈడీ రంగంలోకి దిగి మనీ లాండరింగ్‌ కేసులో విచారణ చేపడుతున్నారు. అనేక కీలక విషయాలను రాబట్టారని సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ సాంగ్ పై విపరీతంగా ట్రోలింగ్.. వర్షం, డార్లింగ్ సినిమాలు వైరల్
800 కోట్లతో బాలీవుడ్ లో దుమ్మురేపిన తెలుగు సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ?