సంచలనాలు నమోదు చేస్తున్న సుశాంత్ చివరి సినిమా

Published : Jul 29, 2020, 05:58 PM IST
సంచలనాలు నమోదు చేస్తున్న సుశాంత్ చివరి సినిమా

సారాంశం

దిల్‌ బెచారా సినిమా ఆల్ టైం రికార్డ్ సాధించింది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ప్రపంచ ప్రఖ్యాత గేమ్‌ ఆప్ థ్రోన్స్‌ సాధించిన వ్యూస్‌ కన్నా దిల్ బెచారా సాధించిన వ్యూస్‌ ఎక్కువ కావటం విశేషం. అంతేకాదు ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ రేటింగ్‌ ఏకంగా 10కి 10 ఇవ్వటం కూడా ఓ రికార్డే అంటున్నారు ఫ్యాన్స్‌.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నుంచి అభిమానులు కోలుకోలేకపోతున్నారు. సుశాంత్ చివరిగా నటించిన దిల్ బెచారా సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిస్నీ హాట్‌ స్టార్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన రికార్డ్‌లు నమోదు చేస్తోంది. ఈ సినిమా రికార్డ్ వ్యూస్‌ సాధిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ అయిన 24 గంటల్లోనే ఏకంవగా తొమ్మిదిన్నర కోట్ల వ్యూస్‌ సాధించింది.

ఇది ఆల్ టైం రికార్డ్ అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ప్రపంచ ప్రఖ్యాత గేమ్‌ ఆప్ థ్రోన్స్‌ సాధించిన వ్యూస్‌ కన్నా దిల్ బెచారా సాధించిన వ్యూస్‌ ఎక్కువ కావటం విశేషం. అంతేకాదు ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ రేటింగ్‌ ఏకంగా 10కి 10 ఇవ్వటం కూడా ఓ రికార్డే అంటున్నారు ఫ్యాన్స్‌. ఈ రికార్డ్‌ లు చూస్తుంటే ఈ సినిమా థియేటర్లలో గనక రిలీజ్ అయి ఉంటే 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించేదని లెక్కలు వేస్తున్నారు సినీ జనాలు.

బాలీవుడ్‌లో ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించాడు. అయితే సుశాంత్ మరణం వెనక కుట్ర ఉందన్న ఆరోపణలు వినిపించటంతో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. తాజాగా సుశాంత్ మృతికి అతడి గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి కారణం అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్