సుశాంత్ కేసు: మృతదేహాన్ని మొదట చూసిన వ్యక్తి కదలికలపై పోలీసుల ఆరా

By Siva KodatiFirst Published Aug 2, 2020, 3:50 PM IST
Highlights

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో బీహార్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో బీహార్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు తమకు సహకరించడం లేదని, కేసుకు సంబంధించని కీలక పత్రాలను అందజేయడం లేదని ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పాట్నా ఎస్పీ వినయ్ కుమార్ ముంబైకి బయల్దేరారు. జూలై 14 అర్థరాత్రి 12.30- 12.45 గంటల ప్రాంతంలో సుశాంత్ రూం తలుపును ఓపెన్ చేసేందుకు ఆయన స్నేహితుడు, రూమ్మేట్ సిద్ధార్థ్ పితాని పిలిపించిన తాళాలు తయారుచేసే వ్యక్తి కోసం పాట్నా పోలీసులు గాలిస్తున్నారు.

కీ మేకర్‌ను గుర్తించామని, త్వరలోనే మొత్తం ఘటనపై అతడిని ప్రశ్నిస్తామని పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తులో భాగంగా బీహార్ పోలీసులు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషాదాంతం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టారు.

సుశాంత్ నివాసంలో పనిచేసే ఆయన సిబ్బందిలో పలువురిని సైతం పోలీసులు ప్రశ్నించారు. ఇక దర్యాప్తులో భాగంగా సుశాంత్ సిబ్బందిలో ఒకరు యువనటుడి స్నేహితురాలు రియా చక్రవర్తి గురించి సంచలన విషయాలు వెల్లడించారు.

సుశాంత్ బాంద్రా నివాసంలో రియా ఉన్నప్పుడు అన్ని విషయాలు ఆమె కనుసన్నల్లోనే సాగేవని సుశాంత్ వద్ద పనిచేసే స్వీపర్ చెప్పారు. రియా అనుమతి లేకుండా సుశాంత్ గదిలోకి ఏ ఒక్కరికీ ప్రవేశం వుండేది కాదని సిబ్బంది చెప్పినట్లుగా తెలిసింది.

సుశాంత్ తన గదిని శుభ్రపరచాలా, లేదా అనేది కూడా ఆమె నిర్ణయించేవారని తెలిపారు. ఇక జూన్ 14న సుశాంత్ విషాదాంతంలో తొలిసారి సుశాంత్ మృతదేహాన్ని చూసిన ఆయన స్నేహితుడు రూమ్మేట్ సిద్దార్థ్ పితాని ఆచూకీపైనా బీహార్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం వున్న పరిణామాలు రియా చుట్టూనే తిరుగుతున్నాయి. 

click me!