సూర్య కిరణ్ ని భార్య కళ్యాణి అందుకే వదిలేసిందట

Published : Sep 20, 2020, 08:22 AM ISTUpdated : Sep 20, 2020, 08:28 AM IST
సూర్య కిరణ్ ని భార్య కళ్యాణి అందుకే వదిలేసిందట

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న సూర్య కిరణ్ మొదటివారమే ఎలిమినేటై బయటికి రావడం జరిగింది. బిగ్ బాస్ వలన సూర్య కిరణ్ ఎవరో ప్రేక్షకులకు తెలియగా, ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. హీరోయిన్ కళ్యాణిని సూర్య కిరణ్ ప్రేమ వివాహం చేసుకోగా తనతో ఆమె ఎందుకు విడిపోయిందో కారణం చెప్పారు...   

బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన మొదటి కంటెస్టెంట్ సూర్య కిరణ్ గురించి ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన సూర్య కిరణ్ చిరంజీవి హీరోగా వచ్చిన రాక్షసుడు, దొంగమొగుడు, కొండవీటి దొంగ సినిమాలలో నటించాడు. అలాగే నాగార్జున నటించిన సంకీర్తన మూవీలో కూడా ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయడం జరిగింది. బాలనటుడిగా వందల చిత్రాలలో చేసిన సూర్య కిరణ్ అనేక అవార్డులు గెలుపొందారు. 

2003లో సుమంత్ హీరోగా వచ్చిన సత్యం దర్శకుడిగా సూర్య కిరణ్ మొదటి చిత్రం. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో సుమంత్ తోనే  ధన 51 మూవీ చేశారు. ఐతే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. మంచు మనోజ్ తో చేసిన రాజుభాయ్ మూవీతో పాటు మరో రెండు చిత్రాలు పరాజయం కావడంతో సూర్య కిరణ్ కెరీర్ ప్రమాదంలో పడింది. 

కెరీర్ లో ఒడిదుడుకులు మొదలవడంతో సూర్య కిరణ్ పర్సనల్ లైఫ్ కూడా ఇబ్బందుల పాలైంది.  సూర్య కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ కళ్యాణి ఆయనకు దూరం అయ్యింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడానికి విడిపోవడానికి ఆర్థిక ఇబ్బందులే అని సూర్య కిరణ్ చెప్పుకొచ్చారు. 

సినిమా వలన సూర్య కిరణ్ కోట్లు నష్టపోయారట. 10కోట్ల రూపాయలు వరకు తన సొంత డబ్బులు సినిమాల వలన నష్టపోయారట. దీనితో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట. రోజూ అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతుంటే కళ్యాణి  చాలా బాధపడేవారట. ఆమె నా నుండి విడాకులు కోరుకోవడానికి కూడా ఇదే కారణం అని సూర్య కిరణ్ చెప్పుకొచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..