ఫ్యాన్స్ కు సెల్ఫీలు ఎందుకు ఇవ్వాలి?.. సూర్య-కార్తీల తండ్రి ఆగ్రహం!

Published : Oct 30, 2018, 05:39 PM ISTUpdated : Oct 30, 2018, 05:44 PM IST
ఫ్యాన్స్ కు సెల్ఫీలు ఎందుకు ఇవ్వాలి?.. సూర్య-కార్తీల తండ్రి ఆగ్రహం!

సారాంశం

సెలబ్రెటీలు వస్తే పట్టరాని సంతోషంలో అభిమానులు ప్రవర్తించే తీరు సెలబ్రెటీలకు కొన్ని సార్లు చేదు అనుభవాన్ని మిగులుస్తాయి. అభిమానులను అర్ధం చేసుకునే సెలబ్రెటీలు చాలా తక్కువమంది ఉంటారు. 

సెలబ్రెటీలు వస్తే పట్టరాని సంతోషంలో అభిమానులు ప్రవర్తించే తీరు సెలబ్రెటీలకు కొన్ని సార్లు చేదు అనుభవాన్ని మిగులుస్తాయి. అభిమానులను అర్ధం చేసుకునే సెలబ్రెటీలు చాలా తక్కువమంది ఉంటారు. ఇకపోతే అప్పుడపుడు సెల్ఫీలు అడిగితే కొట్టేవారు, ఫోన్లు విసిరిసే వాళ్ళు కూడా ఉంటారు. రీసెంట్ గా సూర్య కార్తీ ల తండ్రి శివకుమార్ అదే తరహాలో ప్రవర్తించారు. 

శివకుమార్ ఇటీవల ఒక ఈవెంట్ కు వెళ్ళారు. అయితే అక్కడ అభిమానులు చాలా మంది వచ్చి శివకుమార్ తో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన ఒక మొబైల్ తీసి పారేశారు. అంతే కాకుండా ఆయన ఈ విషయాన్నీ సమర్ధించుకున్నారు. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక ఫైనల్ గా శివకుమార్ తన వివరణను ఈ విధంగా ఇచ్చారు. సెలబ్రెటీలకు కూడా ఓక ప్రయివేట్ లైఫ్ ఉంటుంది. అది సన్నిహితులతో షేర్ చేసుకునేది. ఎవరో తెలియని వారితో సెలబ్రెటీలు ఎందుకు సెల్ఫీ దిగాలి.సెలబ్రేటిస్ ఏమైనా పబ్లిక్ ప్రాపర్టీసా అంటూ ధ్వజమెత్తారు. దీంతో నెటిజన్స్ హీరోల తండ్రి ఇలా స్పందించడం ఏ మాత్రం కరెక్ట్ కాదని కామెంట్ చేస్తున్నారు. 

వీడియో 

PREV
click me!

Recommended Stories

హృతిక్ రోషన్ 'క్రిష్' సినిమాలో ధోని భార్య నటించిందా?
Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ రెండు రోజుల కలెక్షన్లు.. రెండో రోజు పడిపోయిన బాలయ్య సినిమా వసూళ్లు..