సూర్య, దుల్కర్‌ సల్మాన్‌ సినిమా స్టోరీ బ్యాక్‌ డ్రాప్‌ ఇదే..?

Google News Follow Us

సారాంశం

సూర్య, దుల్కర్‌ సల్మాన్‌ కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బ్యాక్‌ డ్రాప్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. రియలిస్టిక్‌ కథతో రాబోతుందని సమాచారం. 

`ఆకాశమే నీ హద్దురా`, `జై భీమ్‌`, `విక్రమ్‌` చిత్రాలతో సూర్య హీరోగా నెక్ట్స్ లెవల్‌కి చేరుకున్నారు. సూపర్‌ స్టార్‌గా మారిపోయారు. ఆయన ఇప్పుడు భారీ చిత్రాల్లో భాగమవుతున్నారు. ప్రస్తుతం `కంగువా` చిత్రంలో నటిస్తున్న ఆయన వెట్రి మారన్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. చందూమొండేటితోనూ ఓ కథ చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించారు. తనకు `ఆకాశమే నీ హద్దురా` వంటి మూవీని అందించిన పరాజయాల నుంచి తనని గట్టెక్కించిన సుధా కొంగరతో మరోసారి సూర్య ఈ చిత్రం చేస్తుండటం విశేషం. 

గురువారం ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేశారు. యాక్షన్‌ ప్రధానంగా సాగుతుందని ఆ ప్రకటన వీడియో తెలియజేస్తుంది. ఇదిలా ఉంటే ఇందులో దుల్కర్‌ సల్మాన్‌ మరో హీరోగా నటిస్తుండటం విశేషం. ఇదే ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక డిఫరెంట్‌ కాంబినేషన్‌ సెట్‌ అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

అయితే ఈ సినిమా స్టోరీ బ్యాక్‌ డ్రాప్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఓ బలమైన అంశాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారట. తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటనలను ప్రతిబింబించేలా సినిమా సాగుతుందని, అంతేకాదు దీన్ని గ్యాంగ్‌స్టర్‌ ప్రధానంగా సాగే పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారని తెలుస్తుంది. ఇందులో సూర్య గ్యాంగ్‌ స్టర్‌ తరహా పాత్రలో కనిపిస్తాడట. ఆయన పాత్రలో పొలిటికల్‌ టచ్‌ కూడా ఉంటుందని టాక్. మరోవైపు  దుల్కర్‌ సల్మాన్‌ పోలీస్‌గా కనిపిస్తాడని సమాచారం. సినిమాలో కొంత గ్యాంగ్‌ స్టర్‌ ఎలిమెంట్లు ఉంటాయట. 

తమన్నా బాయ్‌ ఫ్రెండ్‌ విజయ్‌ వర్మ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయన విప్లవ నాయకుడిగా కనిపిస్తారని టీజర్‌ని బట్టి అర్థమవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ సినిమా అనౌన్స్ మెంట్‌ టీజర్‌ మాత్రం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. మలయాళ భామ నజ్రియా ఫహద్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఆయనకిది వందవ సినిమా కావడం విశేషం. 2డీ ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై జ్యోతిక నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. 

ఇక సూర్య ప్రస్తుతం నటిస్తున్న `కంగువా` చిత్రం దాదాపు రెండు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. రెండు భాగాలుగా ఈ సినిమాని తీసుకురాబోతున్నారు. మొదటి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. దిశా పటానీ ఇందులో కథానాయికగా నటిస్తుంది. దీపికా పదుకొనే కూడా కీలకపాత్రలో మెరుస్తుందని టాక్. దీన్ని జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు.
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...