రానా కంటి సమస్యపై సురేష్ బాబు కామెంట్స్!

By AN TeluguFirst Published Jun 10, 2019, 10:53 AM IST
Highlights

'బాహుబలి' సినిమాతో రానాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. కేవలం సౌత్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా అతడికి అభిమానులు ఉన్నారు. 

'బాహుబలి' సినిమాతో రానాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. కేవలం సౌత్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా అతడికి అభిమానులు ఉన్నారు. డబ్బు, క్రేజ్ ఇలా దేనికి లోటు లేని రానాకి ఒక కన్ను కనిపించదు. ఈ విషయాన్ని ఆయన ఓ టీవీ షోలో తెలిపారు.

తనకు చిన్నప్పుడే కంటి సమస్య వస్తే.. కన్ను తీసేసి మరోకన్ను పెట్టారట. అయితే ఆ కంటికి చూపు మాత్రం లేదు. చిన్నవయసులోనే రానాకు కంటి సమస్య ఎదురైందట. ఈ విషయాలను అతడి తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తెలిపారు. తనకు కొడుకును స్పోర్ట్స్ మ్యాన్ ను చేయాలని సురేష్ బాబు అనుకున్నారట.

కానీ అది సాధ్యం కాలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సురేష్ బాబు తెలిపారు. తనకు క్రీడలపై ఇష్టంతో రానాని స్పోర్ట్స్ మ్యాన్ చేయలనుకున్నారట. ఈ క్రమంలో ముందుగా రానాను ఆర్చరీలో చేర్చగా.. అతడు బాణాన్ని గురిచూసి కొట్టలేకపోయాడని సురేష్ బాబు చెప్పారు. ఆ తరువాత క్రికెట్ లో చేర్పిస్తే.. బంతిని క్యాచ్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నాడని చెప్పారు.

దీంతో కొన్ని పరీక్షలు చేయిస్తే అతడికి కంటి సమస్య ఉందని వైద్యులు చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. దీంతో రానాని క్రీడల్లోకి పంపే ఆలోచన మానుకున్నట్లు చెప్పారు. ఆ తరువాత రానా సినిమాలపై ఆసక్తి పెంచుకొని ఈ రంగంవైపు వచ్చినట్లు తెలిపారు. కానీ రానాకి క్రికెట్ అంటే ఇప్పటికీ చాలా ఇష్టమని అన్నారు. ఈ కంటి సమస్య కారణంగా రానా ఇప్పటికీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని సమాచారం. 

click me!