లీక్ : అరవింద్ 'ఆహా' టార్గెట్.. సురేష్ బాబు,దిల్ రాజు కలిసే స్కెచ్

By Surya PrakashFirst Published Mar 6, 2020, 9:33 AM IST
Highlights

సురేష్ బాబుకు, మరో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు ప్రొపిషనల్ రైవర్లీ ఉంది. డిస్ట్రిబ్యూషన్, థియోటర్స్ లీజ్  విషయంలో వీళ్ళిద్దరూ పోటీ పడుతూంటారు. రీసెంట్ గా అల్లు అరవింద్ డిజిటల్ స్పైస్ ని ఎక్సప్లోర్ చేసారు. ఆయన ఆహా అనే పేరుతో ఓ ఓటీటి ప్లాట్ ఫామ్ ని లాంచ్ చేసారు. 

సురేష్ బాబుకు, మరో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు ప్రొపిషనల్ రైవర్లీ ఉంది. డిస్ట్రిబ్యూషన్, థియోటర్స్ లీజ్  విషయంలో వీళ్ళిద్దరూ పోటీ పడుతూంటారు. రీసెంట్ గా అల్లు అరవింద్ డిజిటల్ స్పైస్ ని ఎక్సప్లోర్ చేసారు. ఆయన ఆహా అనే పేరుతో ఓ ఓటీటి ప్లాట్ ఫామ్ ని లాంచ్ చేసారు. ఇప్పుడు అల్లు అరవింద్, దిల్ రాజు లు సైతం తమకు ఓ ఓటీటి ఫ్లాట్ ఫామ్ ఉంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చేసారు. వాళ్లు కూడా త్వరలో ఓటీటి ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్నట్లు సమాచారం. వెబ్ సీరిస్ లకు,షోలకు రోజు రోజుకూ పెరుగుతున్న పాపులారిటీతో తాము సైతం ఈ రంగంలోకి వచ్చి లబ్ది పొందాలని భావిస్తున్నారట. 

రీసెంట్ గా దిల్ రాజు, సురేష్ బాబు కలిసి ఈ విషయమై చర్చలు జరిపి ఇద్దరూ కలిసి ఓటీటీ ప్లాట్ ఫామ్ పెడదాం అనే డెసిషన్ కు వచ్చారట. అయితే అందుకోసం కొద్ది రోజులు గ్రౌండ్ వర్క్ చేసి భారీగా లాంచ్ చేద్దామనుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు దగ్గుపాటి రానా సైతం ఈ విషయమై ఓ నిర్ణయానికి వచ్చారట. ఆయన సైతం కొంత సమయాన్ని కేటాయిస్తున్నారని చెప్తున్నారు. ఆహా ని మించి పోయేలా... న్యూ జనరేషన్ ప్రాజెక్టులను ఇనీషియేట్ చేయాలనేది వీరి ప్రయత్నంగా చెప్తున్నారు.

ఇప్పటికే స్క్రిప్టులను లాక్ చేయటం మొదలెట్టారని చెప్తున్నారు. తమ బ్యానర్స్ లో చేసి ఖాళీగా ఉన్న దర్శకులకు ఈ ఓటీటీ ప్రాజెక్టులకు అప్పచెప్పే ఆలోచనలో ఉన్నారని వినికిడి. ఎక్కువగా లోకల్ కంటెట్ కు ప్రాధాన్యత ఇచ్చి నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే మార్కెట్లో ఉన్న డిజిటల్ జెయింట్స్ అమెజాన్, నెట్ ఫ్లిక్స్ కు పోటీ ఇస్తారని అంతా భావిస్తున్నారు. అమెజాన్ ఇప్పటికే తెలుగునాట బాగా దూసుకుపోయింది. తెలుగు సినిమాల రైట్స్ తీసుకుని మార్కెట్ ని మెల్లిగా ఆక్రమించేసింది. త్వరలోనే దిల్ రాజు, సురేష్ బాబు కలిసి ఎనౌన్స్ చేసే అవకాసం ఉంది.
 

click me!