చిరు తరువాత బన్నీతోనే.. మెగా హ్యాట్రిక్!

Published : Aug 30, 2018, 06:18 PM ISTUpdated : Sep 09, 2018, 01:45 PM IST
చిరు తరువాత బన్నీతోనే.. మెగా హ్యాట్రిక్!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ సినిమా తరువాత సురేందర్ రెడ్డి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ సినిమా తరువాత సురేందర్ రెడ్డి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. గతంలో బన్నీ-సురేందర్ కాంబినేషన్ లో 'రేసు గుర్రం' సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా ఘన విజయం అందుకుంది. ఆ తరువాత 'రేసు గుర్రం' సినిమాకు సీక్వెల్ ఉంటుందని సురేందర్ రెడ్డి ఓ సందర్భంలో చెప్పాడు. అయితే ఈసారి బన్నీతో చేయబోయే సినిమా సీక్వెలా..? కొత్త కథ..? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కానీ వీరి కాంబినేషన్ లో సినిమా ఖాయమని అంటున్నారు. అదే గనుక జరిగితే మెగా క్యాంపులో సురేందర్ రెడ్డి హ్యాట్రిక్ అందుకున్నట్లే.

గతేడాది రామ్ చరణ్ తో 'ధృవ' సినిమా చేశాడు సురేందర్ రెడ్డి. ఆ సినిమా తరువాత చిరంజీవితో 'సై రా' చేస్తున్నాడు. ఈ సినిమా గనుక మంచి సక్సెస్ అందుకుంటే బన్నీ-సుంరేందర్ రెడ్డిల కాంబినేషన్ పై మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Rishab Shetty: పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టి బర్త్ డే సెలెబ్రేషన్స్.. భార్య పిల్లలతో ఇలా, వైరల్ పోటోస్
Akhil Akkineni: అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే..