వాలెంటైన్స్ డేన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమంటున్నారంటే?

By Asianet News  |  First Published Feb 14, 2023, 12:30 PM IST

ప్రేమికుల దినోత్సవం రోజున మెగా, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్  (Sai Dharam Tej) ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఫన్సీ పిక్స్ షేర్ చేసుకుంటూ యూత్ కు తనదైన శైలిలో పలు సూచనలు చేశారు. 
 


సుప్రీమ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌  వాలెంటైన్స్ డే రోజున ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. ప్రేమికులకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు యూత్ కోసం ఈ ప్రత్యేకమైన  రోజున ఇంట్రెస్టింగ్ గా పోస్టు చేశారు. ‘హౌ టు ఫాల్ ఇన్ లవ్’ అనే పుస్తకాన్ని చదువుతూ ఉన్న ఫొటోలను పంచుకుంటూ ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు. తను పంచుకున్న ఫొటోల్లో మొదట పుస్తకాన్ని ఆసక్తికరంగా చదువుతూ కనిపిస్తారు. రెండో పిక్ లో నిద్రలోకి జారుకున్నారు. ఇలా ఫన్నీ ఫొటోలను పంచుకుంటూ వాలెంటైన్స్ డేన ఆసక్తికరంగా స్పందించారు. 

అయితే ఆ ఫొటోలను వివరిస్తూ సాయి ధరమ్ తేజ్ ఇలా రాసుకొచ్చారు.... ‘నేను ఈ బ్యూటిఫుల్ బుక్ ను పరిశోధించేందుకు ప్రయత్నించాను. చదువుతున్న క్రమంలో ఇలా కొన్ని సార్లు నిద్రలోకి జారిపోయాను. కానీ దీని నుంచి నేను తెలుసుకుంది ఏంటంటే.. మన జీవితంలో ‘ప్రేమ’ ఎంత ముఖ్యమో గ్రహించాను. మనల్ని మనం ప్రేమించడం (సెల్ఫ్ లవ్). మనలోని ప్రత్యేకతను గుర్తించడం, లోపాలనూ స్వీకరించడం, మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని మనం ప్రేమించుకోవడం ముఖ్యమనేది’  తెలుసుకున్నట్టు తెలిపారు.  

Latest Videos

అయితే, సాయి ధరమ్ తేజ్ కు కూడా ఓ బ్రేకప్ స్టోరీ ఉంది. తను డిగ్రీ చదివే రోజుల్లో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డారంట. కొన్నికారణాలతో ఆమె విదేశాలకు వెళ్లిందని, తిరిగి పచ్చాక తనకు ఊహించిన షాక్ ఇచ్చిందన్నారు. పెళ్లి కూతురిగా తన ఫొటోను సెండ్ చేసిందని, అది చూడగానే చాలా భాదేసిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ క్రమంలో ఈ వాలెంటైన్స్ డేన‘సెల్ఫ్ లవ్’పై ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. 

ఇక రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. చివరిగా ‘రిపబ్లిక్’ చిత్రంతో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. సోషల్ యాస్పెక్ట్స్ తో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కార్తీక్‌ దండు దర్శకత్వంలో ‘విరూపక్ష’ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ తో సినిమాపై ఆసక్తిని పెంచేసింది. 

As I tried to delve into this beautiful book (only to fall asleep 🤪)

I realised how important it is to celebrate the most important love in our lives - SELF LOVE, embracing our uniqueness and flaws.

Here's to loving ourselves just the way we are.

Happy ❤️ pic.twitter.com/zUrpHG1sZJ

— Sai Dharam Tej (@IamSaiDharamTej)
click me!