7 రోజులకు అన్ని కోట్లా..? సూపర్ స్టార్ రజనీకాంత్ షాకింగ్ రెమ్యూనరేషన్

Published : Feb 16, 2023, 01:42 PM IST
7 రోజులకు అన్ని కోట్లా..? సూపర్ స్టార్ రజనీకాంత్ షాకింగ్ రెమ్యూనరేషన్

సారాంశం

సూపర్ స్టార్ రజనీ కాంత్ వయస్సుతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుందే తప్పించి తగ్గడంలేదు. రీసెంట్ గా 7 రోజులు కాల్షీట్ కు.. కళ్లుతిరిగే రేటు డిమాండ్ చేశాడట తలైవా...?

సూపర్ స్టార్ రజనీకాంత్.. 70 ఏళ్లు దాటినా.. యంగ్ స్టార్స్ ను మించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు. ఉరకలువేస్తూ.. సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు కాస్త ఆనారోగ్యం ఇబ్బంది పెడుతున్నా..? విశ్రాంతి తీసుకుని..మళ్లీ విజృంబిస్తున్నాడు రజినీ. ఇక ఎంత మంది స్టార్ హీరోలు వచ్చినా.. ఆయన ఇమేజ్ మాత్రం చెక్కుచెదరడంలేదు. అటు రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గడంలేదు రజనీకాంత్. సినిమాకు 100 కోట్లకుపైనే వసూలు చేస్తున్నాడు సూపర్ స్టార్. ఈక్రమంలో రజనీకాంత్ కు సబందించిన ఓన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ప్రస్తుతం తలైవా జైలర్ సినిమా చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఈమూవీ తెరకెక్కుతోంది. ఈసినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమాలో లో రజనీకాంత్ నటించాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే..? ఈసినిమాలో రజనీకాంత్ హీరోగా కాకుండా గెస్ట్ రోల్ చేయబోతున్నారు. గెస్ట్ రోల్స్ అంటే పెద్దగా ఇష్టపడని సూపర్ స్టార్ ఈ సినిమాలో మాత్రం చేయడానికి కారణం ఉంది. ఈమూవీని తన గారాల తనయ ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తుంది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈసినిమాను లైకా ప్రొడక్షన్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

ఇక ఈసినిమాలో ప్రత్యేక పాత్రను రజనీకాంత్ తో చేయించబోతున్నారు  టీమ్. అయితే దీని కోసం సూపర్ స్టార్ 7 రోజులకు ఆయన కాల్షిట్స్ అవసరం ఉన్నాయట. అయితే ఇందుకుగాను సూపర్ స్టార్ దాదాపు 25 కోట్లు తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇక అతి త్వరలోనే రజనీకాంత్ లాల్ సలామ్ సెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. వారం రోజులకు 25 కోట్లు అని తెలియగానే షాక్ అవుతున్నారు నెటిజన్లు. ఇక జైలర్ సినిమా కోసం దాదాపు 140 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట రజనీకాంత్. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 8: వల్లి చదువుపై రచ్చ, ఏ కాలేజీలో చదివావమ్మా బల్లి?
Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్