తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను పలువురు ప్రముఖులు ఖండిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను పలువురు ప్రముఖులు ఖండిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు ఫోన్ చేసిన రజనీకాంత్.. ఆయనను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన ఆత్మీయుడని ఎప్పుడూ తప్పు చేయడని పేర్కొన్నారు. తన మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని అన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ది, సంక్షేమమే ఆయనకు రక్ష అని పేర్కొన్నారు.
చంద్రబాబు ప్రజాసంక్సేమం కోసం నిరంతరం పరితపించే వ్యక్తి అని రజనీకాంత్ చెప్పారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమి చేయలేవని అన్నారు. చంద్రబాబు చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.