ఈ మధ్య టాలీవుడ్ స్టార్ హీరోల ఇంట రెండు విషాద సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలసిందే. ప్రభాస్ పెదనాన్న, అలనాటి రెబల్ స్టార్ కృష్ణం రాజు, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి మృతి చెందారు. ఇక తన తల్లి ఆత్మ శాంతి కోసం మహేష్ బాబు ప్రభాస్ చేసినట్టే ఓ పని చేయబోతున్నాడట..?
టాలీవుడ్‌లో గత నెల రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. రెబల్ స్టార్ కృష్ఱంరాజుతో పాటు సూపర్ స్టార్ కృష్ఱ భార్య, మహేష్ బాబు తల్లి ఇందిర చనిపోయారు. గత నెల 11 కృష్ఱంరాజు మరణించారు. అదే నెల 28న మహేష్ బాబు తల్లి మరణించారు. ఇక ప్రభాస్ తన పెదనాన్నా సంస్మరణ సభను స్వగ్రామం మొగల్తూరులో ఘనంగా నిర్వహించారు. కృష్ఱంరాజు తమ్ముడి కొడుకు అయిన ప్రభాస్ అన్నీ తానై ఈ కార్యక్రమాన్ని చూసుకున్నారు. అ కార్యక్రమానికి దాదాపు లక్షమందికి పైగా వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రతీ ఒక్కరు కడుపునిండా తిని వెల్లాలని ప్రభాస్ ఫ్యాన్స్ కు సూచించారు. ఇక కృష్ఱంరాజు, ప్రభాస్ ఇద్దరు మంచిభోజన ప్రియులు కావడంతో ఆయన సంస్మరణ సభకు వచ్చిన వారందరికీ 50 రకాలకు పైగా వంటకాలతో భోజనాలు వడ్డించారు. దీని కోసం దాదాపుగా ప్రభాస్ 3 కోట్ల వరకూ ఖర్చు చేశారట. ఎక్కడా లోటు లేకుండా అందరికి భోజనం అందాలని.. ఖర్చు విషయంలో వెనకాడి.. లేకపోతే టైమ్ సరిపోదని. ఎవరినీ ఖాళీ కడుపుతో పంపించవద్దంటూ.. ప్రభాస్ ఆర్డర్ వేసినట్టు తెలుస్తోంది.
ఇక ఈ విషయంలో సూపర్ స్టర్ మహేష్ బాబు కూడా ప్రభాస్ లానే చేయాలని చూస్తున్నాడట. కృష్ణ భార్య, మహేష్ తల్లి ఇందిర గత నెల 28న మరణించగా.. శనివారం ఆమె పెదకర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇప్పుడు తన తల్లి సంస్మరణ సభను తమకు సొంత ఊరు అయిన బుర్రి పాలెంలోనూ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈనెల 16న కృష్ణ స్వస్థలం బుర్రిపాలెంలో ఈ స్మారక కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు ఫిల్మ్ సర్కిల్ నుంచి న్యూస్ వినిపస్తోంది.
ఇక ఈ కార్యక్రమానికి .. కృష్ణ కుటుంబ సభ్యులంతా వస్తారని తెలుస్తోంది. అలాగే, అభిమాను లందరికీ ఆహ్వానం పలుకుతారని మహేష్ టీమ్ నుంచి సమాచారం అందుతోంది. ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారంజ