మహేశ్ బాబు గురించి ఎవ్వరికీ తెలియని సీక్రెట్ చెప్పిన బాబాయ్.. ఈ టాలెంట్ కూడా ఉందా?

By Asianet News  |  First Published May 25, 2023, 5:26 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎంత టాలెంటో అందరికీ తెలిసిందే. అయితే మన మహేశ్ బాబు గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ ను ఆయన బాబాయ్ రిలీజ్ చేశారు. దీంతో నెట్టింట వైరల్ గా మారింది.
 


దివంగత, సూపర్ స్టార్ కృష్ణ (Krishna) చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. ఆయన చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తన్ మార్క్ క్రియేట్ చేశారు. 360 చిత్రాల్లో నటించిన ఆయన నిర్మాతల హీరోగా, రికార్డుల గనిగా, చక్కని రూపసిగా తెలుగు గడ్డపై ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, మహేశ్ బాబాయ్ ఆదిశేషగిరి రావు (Adiseshagiri Rao)  కృష్ణతో ఓ చిత్రాన్ని నిర్మించారు. అదే ‘మోసగాళ్లకు మోసగాడు’. ప్రస్తుతం రీరిలీజ్ కు సిద్ధంగా ఉంది. 

ఇప్పటికే 4కే ప్రింట్ ను కూడా రెడీ చేసినట్టు మేకర్స్  అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్ర ట్రైలర్ కూడా విడుదలై ఆకట్టుకుంటోంది. మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయడం విశేషం. మే31న సూపర్ స్టార్ కృష్ణ 80వ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. దీంతో చిత్ర ప్రమోషన్స్  కార్యక్రమాల్లో ఆదిశేషగిరి రావు చురుకుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మహేశ్ బాబు గురించి ఓ టాప్ సీక్రెట్ ను రివీల్ చేశారు. 

Latest Videos

ఆయన మాట్లాడుతూ.. మహేశ్ బాబు తనకు చిన్నప్పటి నుంచి తెలుసన్నారు. ఎంతో ప్రతిభావంతుడని చెప్పుకొచ్చారు. మహేశ్ నటించిన ‘వంశీ’ చిత్రానికి ప్రొడ్యూస్ చేశానని, నమ్రతను హీరోయిన్ గా సెలెక్ట్ చేసింది కూడా ఆయననేని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మహేశ్ - నమ్రతల పెళ్లి విషయంలోనూ తన పాత్ర ఉందని చాలా మంది అనుకున్నారు. కానీ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవినే వారిఇద్దరి పెళ్లి అసలు కారణమని చెప్పారు. ఇక మహేశ్ నటుడు మాత్రమే కాదని.. మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అని కూడా ఎవరికీ తెలియని సీక్రెట్ ను రివీల్ చేశారు. అలాగే మహేశ్ బాబు ఎవరినైనా ఇట్టే ఇమిటేట్ చేయగలడని కూడా చెప్పారు. 

ఇక చిత్రసీమలో సాంకేతిక పరంగా కృష్ణ ఎన్నో ప్రయోగాత్మ సినిమాలు చేశారు. ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే చిత్రం Mosagallaku Mosagadu.  ఇండియాస్ ఫస్ట్ కౌబాయ్ ఫిల్మ్ గా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఆది  శేషగిరి రావు నిర్మించారు. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు.  కృష్ణ, విజయనిర్మల జంటగా నటించారు. 1971లో విడుదలైంది. 52 ఏళ్లకు మళ్లీ విడుదలవుతోంది. కృష్ణ గతేడాది నవంబర్ 15న తుదిశ్వాస విడిచారు. 

మరోవైపు కృష్ణ పుట్టిన రోజున సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ కాంబోలో  రూపుదిద్దుకుంటున్న SSMB28 నుంచి కూడా అప్డేట్ రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్  పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్లు పూజా హెగ్దే (Pooja Hegde), శ్రీలీలా (Sree Leela) హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 2024 జనవరి 13న విడుదల కానుంది. 

click me!