శంకర్ తో సినిమాను రెండు సార్లు రిజెక్ట్ చేసిన మహేష్ బాబు..

By Mahesh Jujjuri  |  First Published Feb 22, 2024, 5:10 PM IST

సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే.. ఎవరైనా సరే నో చెప్పలేరు. అటువంటిది.. శంకర్ సినిమా చేద్దాం అని వస్తే.. రెండుసార్లు రిజెక్ట్ చేశాడట టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎందుకో తెలుసా..? 
 


ఏడాదికో సినిమా చేస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఒక్కోసారి అది కూడా కష్టమైపోతుంది. మిగతా టైమ్ తన ఫ్యామిలీకి కేటాయిస్తాడు సూపర్ స్టార్. కథలు, దర్శకుల వియంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెల్తోన్న సూపర్ స్టార్.. టాలీవుడ్ లోతిరుగులేని ఇమేజ్ తోదూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేసి.. ఎన్ని రాకార్డ్ లు క్రియేట్ చేసినా..?   పోకిరి సినిమాతో మహేష్ సాధించిన ఘనతా.. ఎప్పటికీ చెరిగిపోదు. ఆ టైమ్ లోనే 75 కోట్లు కలెక్ట్ చేసి.. ఇండస్ట్రీ రికార్డ్ ను నెలకొలిపింది పొకిరిమూవీ. ఈసినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన మహేష్ బాబు ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా మారాడు. 

అయితే పోకిరి తరువాత మహేష్ మ్యానియా సౌత్ ఇండియా అంతట పాకింది. ఇక అప్పటి నుంచి సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్స్ మహేష్ బాబు తో సినిమా చేయాలని గట్టిగా ట్రై చేశారు. కాని మహేష్ బాబు మాత్రం సినిమాల విషయం లో చాలా ఆచి తుచి అడుగులు వేస్తుంటాడు. సరిగ్గా ఆ టైమ్ లోనే  సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ కూడా మహేష్ బాబు తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అది ఏ సినిమానో తెలిస్తే షాక్ అవుతారు.. అదేంటంటే..బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన త్రీ ఇడియట్స్  సినిమాని శంకర్ మహేష్ బాబు తో రీమేక్ చేయాలని చూశాడు. 

Latest Videos

అయితే  మహేష్ బాబు మాత్రం దానికి ఆసక్తి చూపించలేదు.. ఆసినిమా ఇక్కడ హిట్ అవ్వదని కూడా  ముందు పసిగట్టారట మహేష్. దాంతో శంకర్ విజయ్ ని హీరోగా పెట్టి తెలుగు, తమిళ రెండు భాషల్లో స్నేహితుడు  పేరుతో సినిమా చేశాడు. ఈ సినిమా తెలుగులో ప్లాప్ అయింది. తమిళంలో కూడా యావరేజ్ గా ఆడింది.  ఆవిదంగా ప్లాప్ నుంచి మహేష్ బాబు తెలివిగా తప్పించుకున్నాడు. 

అంతే కాదు మరోసారి ఇలానే మరో సినిమా కోసం మహష్ ను అడిగాడట శంకర్. మహేష్ బాబుతో ఒక స్ట్రైయిట్ తెలుగు సినిమా చేయాలని శంకర్ అనుకున్నాడు. కానీ అప్పుడు కూడా మహేష్ బాబు శంకర్ కి అవకాశం ఇవ్వలేదు. ఇలా మహేష్ రెండు సార్లు శంకర్ సినిమాను చేయను అనేశాడట. దాంతో అప్పటి నుంచి శంకర్ కూడా మహేశ్ ను అడగలేదు. సినిమా చేయలేదు. 
 

click me!