త్రివిక్రమ్ కి షాక్... ఎస్ఎస్ఎంబి 28 నుండి మహేష్ లుక్ లీక్!

By Sambi ReddyFirst Published Jan 31, 2023, 2:47 PM IST
Highlights


మహేష్ కొత్త మూవీకి లీకుల బెడద ఎక్కువైంది. సెట్స్ నుండి ఫోటోలు బయటకు వస్తున్నాయి. తాజాగా మహేష్ గెటప్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 

సర్కారు వారి పాట మూవీ విజయంతో మహేష్ జోరు మీదున్నారు. ఈ మధ్యకాలంలో మహేష్ విడుదల చేసిన చిత్రాలన్నీ భారీ వసూళ్లు రాబట్టాయి. హిట్ ట్రాక్ లో దూసుకెళుతున్న సూపర్ స్టార్ మహేష్... ఎస్ఎస్ఎంబి 28 రెగ్యులర్ షూట్లో పాల్గొంటున్నారు. మూవీ లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది. కాగా సెట్స్ నుండి మహేష్ లుక్ లీకైంది. తలకు కర్చీఫ్ కట్టుకొని మాస్ గెటప్ లో మహేష్ ఆకట్టుకున్నారు. కాగా పోకిరి, శ్రీమంతుడు చిత్రాలను లీక్డ్ గెటప్ గుర్తు చేసింది. 

దర్శకుడు త్రివిక్రమ్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారట. దశాబ్దం అనంతరం మహేష్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ సెట్ అయ్యింది. గతంలో మహేష్ అతడు, ఖలేజా చిత్రాలకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. అనుకున్న సమయానికి షూటింగ్ మొదలు కాలేదు. గతంలో 2023 సమ్మర్ కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది చివర్లో ఎస్ఎస్ఎంబి 28 విడుదల కావచ్చు. 

సూర్యదేవర నాగవంశీ ఈ చిత్ర నిర్మాతగా ఉన్నారు. పూజా హెగ్డే హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్ నిరవధికంగా షూట్ ప్లాన్ చేశారు. శ్రీలీల రెండో హీరోయిన్ గా చేస్తున్నారనే ఓ పుకారు ఉంది. తాజాగా ఓ కీలక రోల్ కోసం ఐశ్వర్య రాయ్ ని రంగంలోకి దించారంటూ కథనాలు తెరపైకి వచ్చాయి. కాగా విడుదలకు నెలల సమయం ఉండగానే ఎస్ఎస్ఎంబి 28 భారీగా బిజినెస్ చేస్తుందట. ఇక ఈ చిత్ర డిజిటల్ రైట్స్ రూ. 80 కోట్లు పలికినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. 

మరోవైపు మహేష్-రాజమౌళి చిత్ర షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో మహేష్  ఏక కాలంలో రెండు చిత్రాల షూట్ లో పాల్గొనే అవకాశం కలదు. ఇక రాజమౌళి గత చిత్రాలకు మించి భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. మహేష్ మూవీ బడ్జెట్ రూ. 500 కోట్లు పైమాటే అంటున్నారు. 

click me!