రవితేజకి అసిస్టెంట్ గా మారిన సునీల్!

Published : Nov 05, 2018, 12:56 PM IST
రవితేజకి అసిస్టెంట్ గా మారిన సునీల్!

సారాంశం

ఒకప్పుడు శ్రీనువైట్ల సినిమాలలో కమెడియన్ సునీల్ కోసం సెపరేట్ ట్రాక్ లు ఉండేవి. ఆ కామెడీ సీన్లు సినిమాకి హైలైట్ గా నిలిచేవి. సునీల్ హీరోగా మారిన తరువాత కమెడియన్ గా చేయడం మానేశాడు. అయితే హీరోగా అతడికి కలిసిరాకపోవడంతో మళ్లీ కమెడియన్ అవతారమెత్తాడు. ఈ క్రమంలో చేసిన 'సిల్లీ ఫెలోస్' సినిమా ఫ్లాప్ అయింది. 

ఒకప్పుడు శ్రీనువైట్ల సినిమాలలో కమెడియన్ సునీల్ కోసం సెపరేట్ ట్రాక్ లు ఉండేవి. ఆ కామెడీ సీన్లు సినిమాకి హైలైట్ గా నిలిచేవి. సునీల్ హీరోగా మారిన తరువాత కమెడియన్ గా చేయడం మానేశాడు.

అయితే హీరోగా అతడికి కలిసిరాకపోవడంతో మళ్లీ కమెడియన్ అవతారమెత్తాడు. ఈ క్రమంలో చేసిన 'సిల్లీ ఫెలోస్' సినిమా ఫ్లాప్ అయింది. ఆ తరువాత 'అరవింద సమేత' సినిమాలో ఎన్టీఆర్ తో పాటు ఉండే పాత్రలో కనిపించాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ నటవిశ్వరూపం అందరినీ డామినేట్ చేసేసింది. దీంతో సునీల్ కి ప్రత్యేకంగా ఎలాంటి గుర్తింపు రాలేదు. తాజాగా శ్రీనువైట్ల రూపొందిస్తోన్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో సునీల్ ని తీసుకున్నాడు. హీరో రవితేజతో పాటు సినిమా మొత్తం ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అని తెలుస్తోంది. 

రవితేజకి అసిస్టెంట్ పాత్రలో సునీల్ కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమాలో సునీల్ పూర్తిస్థాయి కామెడీ పండిస్తాడని అంటున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి పేరు దక్కించుకుంటాడో చూడాలి. నవంబర్ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది!

PREV
click me!

Recommended Stories

Tanuja: కళ్యాణ్‌ పడాల, పవన్‌ సాయి, ఎంఎం విషయంలో దారుణంగా ట్రోల్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన తనూజ
Ramayana Trailer: రామాయణం ట్రైలర్ వాయిదా, కన్ఫర్మ్ చేసిన నిర్మాత .. కారణం ఇదే!