వేదాంతం రాఘవయ్యగా సునీల్‌.. హీరోగా చివరి ప్రయత్నమా?

Published : Aug 31, 2020, 01:15 PM IST
వేదాంతం రాఘవయ్యగా సునీల్‌.. హీరోగా చివరి ప్రయత్నమా?

సారాంశం

రెండేళ్ళ క్రితం `సిల్లీ ఫెలోస్‌`తో హీరోగా చివరి ప్రయత్నం చేసిన సునీల్‌ అది కూడా వర్కౌట్‌ కాకపోవడంతో హీరోగా  తాత్కాలికంగా బ్రేక్‌ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. 

హాస్యనటుడు సునీల్‌ టాప్‌ కమెడీయన్‌గా రాణిస్తున్న క్రమంలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. `అందాల రాముడు`తో హీరోగా నిరూపించుకున్నారు. `మర్యాద రామన్న`తో ఇక హీరోగా సెటిల్‌ అయిపోతాడని అంతా అనుకునేలా  చేశాడు. వరుసగా హీరోగా సినిమాలు చేసినా కలిసి రాలేదు. 

రెండేళ్ళ క్రితం `సిల్లీ ఫెలోస్‌`తో హీరోగా చివరి ప్రయత్నం చేసిన సునీల్‌ అది కూడా వర్కౌట్‌ కాకపోవడంతో హీరోగా  తాత్కాలికంగా బ్రేక్‌ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ప్రముఖ మాస్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కథతో ఓ సినిమాలో నటించబోతున్నారు. దీనికి `వేదాంతం రాఘవయ్య` అనే టైటిల్‌ని కూడా నిర్ణయించారు. 14రీల్స్ ప్లస్‌ పతాకంపై రామ్‌ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. 

ఇందులో వేదాంతం రాఘవయ్య పాత్రలో సునీల్‌ కనిపించనున్నారు. వినోదం, విభిన్నమైన కథాంశాలు మేళవించిన ఈ సినిమా సునీల్‌ని హీరోగా నిలబెడుతుందని నిర్మాతలు అంటున్నారు. సునీల్‌ కూడా హీరోగా తనకిది చివరి ప్రయత్నంగానే భావిస్తున్నట్టు సమాచారం. మరి అది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తారు, ఇతర కాస్టింగ్‌ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. మరోవైపు సునీల్‌ `కలర్‌ఫోటో` చిత్రంలో విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

'రౌడీ జనార్ధన' గ్లింప్స్ రివ్యూ.. కింగ్డమ్ లా గురి తప్పేలా లేదు, విజయ్ దేవరకొండ బీభత్సం చూశారా
'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?