దెయ్యానికే దడ పుట్టించేలా ఉందీ ట్రైలర్

Published : Jun 30, 2019, 01:03 PM IST
దెయ్యానికే దడ పుట్టించేలా ఉందీ ట్రైలర్

సారాంశం

యంగ్ హీరో  సందీప్‌ కిషన్ హిట్..ఫ్లాఫ్ లతో సంభందం లేకుండా కొత్త కథాంశంతో మెప్పించే ప్రయత్నం చేస్తూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా సందీప్ ‘నిను వీడని నీడను నేనే’ అంటూ ప్రేక్షకుల్ని భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ‌

యంగ్ హీరో  సందీప్‌ కిషన్ హిట్..ఫ్లాఫ్ లతో సంభందం లేకుండా కొత్త కథాంశంతో మెప్పించే ప్రయత్నం చేస్తూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా సందీప్ ‘నిను వీడని నీడను నేనే’ అంటూ ప్రేక్షకుల్ని భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ‌అన్య సింగ్‌  హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి కార్తీక్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. 

సందీప్‌ ఈ సినిమా కోసం నిర్మాతగా మారడం విశేషం. వెంకటాద్రి టాకీస్‌, వి స్టూడియోస్,‌ విస్తా డ్రీమ్‌ సంస్థలు ఈ చిత్రం నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరూ ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

జూలై 12 న సినిమా విడుదల చేస్తామని చెబుతున్నారు.  హారర్ కలగలిపిన థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కింది.  పోసాని, మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా : పికె వర్మ, ఎడిటింగ్ : ప్రవీణ్ కెఎల్, సంగీతం : ఎస్ఎస్ థమన్, ఆర్ట్ : విదేష్, స్టంట్స్ : వెంకట్.

PREV
click me!

Recommended Stories

Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌