రాధిక, శరత్ కుమార్ లపై కోర్టు ఆగ్రహం.. అరెస్ట్?

Published : Jun 30, 2019, 10:44 AM ISTUpdated : Jun 30, 2019, 10:47 AM IST
రాధిక, శరత్ కుమార్ లపై కోర్టు ఆగ్రహం.. అరెస్ట్?

సారాంశం

  కోలీవుడ్ ప్రముఖ సినీ దంపతులకు సైదాపేట కోర్టు షాకిచ్చింది. సీనియర్ నటుడు శరత్ కుమార్ ఆయన సతీమణి రాధికా శరత్ కుమార్ లను వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది.

కోలీవుడ్ ప్రముఖ సినీ దంపతులకు సైదాపేట కోర్టు షాకిచ్చింది. సీనియర్ నటుడు శరత్ కుమార్ ఆయన సతీమణి రాధికా శరత్ కుమార్ లను వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది.  వీరితో పాటు మరొ నిర్మాత లిస్టిన్‌ స్టీఫెన్‌ ని కూడా అరెస్ట్ చేయాలనీ పోలీసులకు ఆదేశాలు అందాయి. 

అసలు వివరాల్లోకి వెళితే.. శరత్ కుమార్, రాధికా, లిస్టిన్ స్టీఫెన్ గతంలో పలు సినిమాలను సంయుక్తంగా నిర్మించారు. అయితే ఒక సినిమా కోసం రేడియన్ అనే మీడియా సంస్థ నుంచి 2కోట్ల ఋణం తీసుకున్నారు. తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వాల్సిందిగా సదరు మీడియా సంస్థ ఒత్తిడి పెంచడంతో శరత్ కుమార్, రాధిక  చెక్ ఇచ్చారు. 

చెక్ బౌన్స్ అవ్వడంతో రేడియన్ సంస్థ సైదాపేట కోర్టుపిటిషన్ దాఖలు చేశారు. అయితే శుక్రవారం విచారణలో భాగంగా కోర్టులో హాజరు కావాల్సిన రాధికా, శరత్ కుమార్ లు రాలేదు. దీంతో వెంటనే వారిని అరెస్ట్ చేయాలనీ న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణకు కేసును జులై 12వ తేదికి వాయిదా వేశారు 

PREV
click me!

Recommended Stories

కాసుల వర్షం కురిపిస్తున్న రాజా సాబ్, ప్రభాస్ సినిమా 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
కెమెరాల ముందు ప్రియాంక, నిక్ రొమాన్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో స్టార్ కపుల్ సందడి