
సందీప్ కిషన్ కి సరైన హిట్ పడి మూడేళ్లు దాటి పోయింది. 2021లో ‘A1 ఎక్స్‌ప్రెస్’తో హిట్ కొట్టిన సందీప్ కిషన్.. ఆ తరువాత గల్లీ రౌడీ, మెఖైల్, ఊరు పేరు భైరవకోన అంటూ వరస పెట్టి సినిమాలు చేసారు. అయితే ఏ సినిమాతోనూ సరైన సక్సెస్ అందుకోలేదు. దాంతో హిట్ ఇచ్చిన డైరక్టర్స్ తో తన జర్నీ మొదలెట్టాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం ఈ హీరో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ RSJ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు.
అలాగే తాజాగా సందీప్ కిషన్ మరో ప్రాజెక్టు సైన్ చేసారు. అయితే అది వెబ్ సీరిస్ అని తెలుస్తోంది. రీసెంట్ గా సూపర్ హిట్ టాక్ ‘టిల్లు స్క్వేర్’ని డైరక్ట్ చేసిన దర్శకుడు మల్లిక్ రామ్ తో ఈ సిరీస్ ని చేయబోతున్నారట. అల్లరి నరేష్ తో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాని నిర్మించిన రాజీవ్ చిలుక ఈ సిరీస్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారట. నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ గా ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు రాబోతుందని సమాచారం. గతంలో ఫ్యామిలీమెన్’ వెబ్ సిరీస్‌లో సందీప్ కిషన్ నటించారు.అయితే అది ఫుల్ లెంగ్త్ రోల్ అయితే కాదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు.
‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ ని అందుకున్న త్రినాథరావు నక్కిన, ప్రసన్న కుమార్ కాంబినేషన్ లో సందీప్ తన 30వ సినిమాని చేస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్న ఈ చిత్రం కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని సమాచారం. రావు రమేష్ కీలక పాత్రధారి. ఈ చిత్రం కోసం ‘మజాకా’ అనే పేరు పరిశీలిస్తున్నారు.