Sukesh Chandhrashekar Case : సుకేష్ చంద్రశేఖర్ టార్గెట్ లో మరో ముగ్గురు హీరోయిన్లు.. వెల్లడించిన ఈడీ..

Published : Feb 24, 2022, 10:52 AM IST
Sukesh Chandhrashekar Case : సుకేష్ చంద్రశేఖర్ టార్గెట్ లో మరో ముగ్గురు హీరోయిన్లు.. వెల్లడించిన ఈడీ..

సారాంశం

నిందితుడు సుఖేష్ చంద్ర వలలో ఒక్క జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహినే కాకుండా మరో ముగ్గురు బాలీవుడ్ తారలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ తాజాగా తన విచారణలో వెల్లడింది.   

ప్రముఖ ఫార్మా కంపెనీ రాన్‌బాక్సీ ప్రమోటర్ అదితి సింగ్ ను  బెదిరించి.. ఆమె నుంచి రూ. 215 కోట్లను 
సుకేష్ చంద్రశేఖర్  రాబట్టేందుకు ప్రయత్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతినిధి అని, న్యాయశాఖ కార్యదర్శిని, పీఎంవోలో కీలక అధికారిని అంటూ సుకేష్ ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేసే వాడనే ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. అదితి సింగ్‌కు ఫోన్ చేసి నీ భర్త అరెస్ట్ కాకుండా ఉండాలంటే.. 2015 కోట్లు ఇవ్వాలని బెదిరించడంతో..  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సుకేష్ ను పోలీసులు గతేడాది అరెస్ట్ చేసి ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. 
 
అయితే, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ అధికారులు మెల్లమెల్లగా పూర్తి వివరాలను రాబడుతున్నారు. ఈ మేరకు కొనసాగిస్తున్న విచారణలో మరో ముగ్గురు బాలీవుడ్ తారలు కూడా చంద్రశేఖర్ వలలో పడ్డట్టు తెలుస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు నోరా ఫతేహితో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్, భూమి పెడ్నేకర్‌లను కూడా టార్గెట్ చేశాడు. జైలు నుంచే  ఈ హీరోయిన్లను సుకేష్ చంద్రశేఖర్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తులో వెల్లడైంది, ఈ మేరకు ఈడీ వర్గాలు ఓ మీడియాకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను తెలియజేశారు.  

అయితే, ముగ్గురు నటీనటులు సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ మరియు భూమి పెడ్నేకర్ లకు సుఖేష్ ప్రత్యేకమైన బహుమతులు అందించేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. వాట్సాప్‌లో కొనసాగిన సంభాషణ ద్వారా సుకేష్ సారాకు స్నేహపూర్వకంగా ఒక కారును బహూకరించాలనుకున్నట్టు చెప్పారు.   ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల దాఖలు చేసిన ఛార్జ్ షీట్ సౌజన్యంతో సుఖేష్ చంద్రశేఖర్ కథలో రెండు సంచలనాత్మక ఎపిసోడ్‌లు వెలువడ్డాయి.

చాలా మంది హీరోయిన్లు మరియు మోడల్స్ ఈ మోసగాడికి ఏంజెల్ (53)గా పిలవబడే సహచరి పింకీ ఇరానీ ద్వారా పరిచయం అయ్యారు. వారిలో కొందరిని స్వయంగా జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్‌ను కలవడానికి తీసుకెళ్లిందని..  ఏజెన్సీ తెలిపింది. గత ఏడాది డిసెంబర్‌లో ఆమెను ఏజెన్సీ అరెస్టు చేయగా, ఇటీవల ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మనీలాండరింగ్ కేసులో ముంబైకి చెందిన ఇరానీ పాత్రను వివరిస్తూ అనుబంధ చార్జ్ షీట్‌ను ఈ నెల ప్రారంభంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టు ముందు దాఖలు చేసింది.

పింకీ, భార్య లీనా మారియా ద్వారా సారా అలీఖాన్, జాన్వీ కపూర్, భూమి ఫెడ్నెకర్ లకు వలవేసిన చంద్రశేఖర్ వారికి కాస్ట్లీ కారులు, గోల్డ్స్, ఖరీదైన గిఫ్ట్స్ ఎరగా విసిరే ప్రయత్నం చేశాడు. అయితే సుఖేష్ పంపిన గిఫ్ట్ లను సారా అలీఖాన్ తిరస్కరించినట్టు ఆమె అధికారులకు తెలిపారు. సుకేష్ ను తను కూడా దూరంగానే ఉంచినట్టు జాన్వీ కపూర్ తెలుపుతోంది.  భూమి ఫెడ్నేకర్ కూడా సుకేష్ చంద్రశేఖర్ నుంచి ఎలాంటి బహుమతులు స్వీకరించలేదని తెలిపింది. 

అయితే... ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ కుంభకోణం నుండి ఆదాయాన్ని పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ట్రాక్ చేస్తోంది. ఈ మేరకు ఇంకా విచారణను కొసాగిస్తోంది. గతేడాది సుకేష్ చంద్రశేఖర్ నుంచి  గతేడాది ఆగస్టులో  చంద్రశేఖర్‌కు సంబంధించిన కొన్ని స్థలాలపై ఈడీ దాడి చేసి చెన్నైలోని సముద్రానికి ఎదురుగా ఉన్నబంగ్లాను,  రూ. 82.5 లక్షల  నగదు మరియు డజనుకు పైగా లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం