#RaviTeja: రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ కీ రోల్ లో ఆ యంగ్ హీరో

By Surya Prakash  |  First Published Jan 25, 2024, 6:17 AM IST

రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న ఈ సినిమా ట్యాగ్‌లైన్ ‘నామ్ తో సునా హోగా’. ఈ సినిమాలో  యంగ్ హీరో కీలక పాత్రలో కనిపించనున్నారు



సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా పరిశ్రమకి పరిచయమైన హీరో ‘సుధీర్ బాబు’. వైవిధ్యమైన కథలు, పాత్రలు చేస్తూ.. అటు మాస్‌ ఆడియన్స్‌ని, ఇటు క్లాస్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని హీరోగా కొనసాగుతున్నారు సుధీర్ బాబు.  అయితే గత కొంతకాలంగా ఆయన చేసిన సినిమాలు ఏమీ ఆడటం లేదు. వరస డిజాస్టర్స్ అవుతున్నాయి. ఎంతో హోప్ పెట్టుకుని చేసిన హంట్, మామ మశ్చీంద్రా సినిమాలు కూడా దారుణంగా దెబ్బ కొట్టాయి. ఈ క్రమంలో ఇప్పుడు రూట్ మార్చి ప్రత్యేక పాత్రలో కనిపించటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో  హీరో సుధీర్ బాబు కూడా నటిస్తారని తెలుస్తుంది. సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో సుధీర్ బాబు కనిపించబోతున్నారట. రీసెంట్ గా హరీష్ శంకర్ సుధీర్ బాబుని కలిసి ఓకే చేయించుకున్నారని అంటున్నారు.   మిస్టర్ బచ్చన్   సినిమాలో సుధీర్ బాబు నటించడం కూడా ప్రాజెక్ట్ పై భారీ హైప్ తెస్తుందని చెప్పలేం కానీ క్యూరియాసిటీ అయితే క్రియేట్ అవుతుందనటంలో సందేహం లేదు. హరీష్ శంకర్, రవితేజ కాంబో మాస్ రాజా ఫ్యాన్స్ కి సూపర్ జోష్ ఇస్తుంది. రవితేజ సుధీర్ బాబు ఈ కాంబో కూడా కచ్చితంగా ఆడియన్స్ కు మంచి థ్రిల్ అందిస్తుందని అంచనా వేస్తున్నారు.

Latest Videos

‘మిస్టర్ బచ్చన్’ విషయానికి వస్తే..

రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్’ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైయింది. తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ కోసం టీం కరైకుడికి వెళ్ళింది. ఈ షెడ్యూల్‌లో కరైకుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.    

రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న ఈ సినిమా ట్యాగ్‌లైన్ ‘నామ్ తో సునా హోగా’. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్,  టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

click me!