
స్టార్ హీరో పుట్టిన రోజు వస్తుంది అంటే చాలు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు.. ఏదైన కొత్త సినిమా అనౌన్స్ చేస్తారా..? లేక ప్రస్తుతం చేస్తున్న సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ రిలీజ్ చేస్తారా ..? అని. ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఖచ్చితంగా తమ హీరో కొత్త సినిమాకి సంబంధించి.. ఏదైనా చిన్న అప్డేట్ అయినా అనౌన్స్ చేస్తారని అభిమానులకి చిన్న ఆశతో ఉంటారు. ఏదీ ఇవ్వకుండా ఉన్నారంటే.. నిరాశపడుతుంటారు. ఇక త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే ఉంది. దాంతో మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు చరణ్ నుంచి సర్ ప్రైజ్ ఏముంటుంది అని.
మార్చ్ 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఫ్యాన్స్ కి మెగా గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. ఇంతకీ మెగా ఫ్యాన్స్ కోసం ఇచ్చే ఆ కొత్త అప్ డేట్ ఏంటీ అంటే..? చరణ్ , శంకర్ సినిమాకు సబందించిన టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారు టీమ్. ప్రస్తుతం జోరు మీద ఉన్నాడు రామ్ చరణ్. ఆస్కార్ బరిలో ట్రిపుల్ ఆర్ ఉండటం. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ కు ఎన్నో అవార్డ్స్ రాడంతో దిల్ ఖుష్ అవుతున్నారు. అంతే కాదు రామ్ చరణ్ పర్ఫామెన్స్ కు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ కూడా ముచ్చటపడి.. ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
ఈ క్రమంలో ఇన్ని అంచనాల నడుమ.. గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్.. నెక్ట్స్ సినిమాకు సబంధించి టైటిల్ ఎలా ఉంటుంది అని పాన్ ఇండియా రేంజ్ లో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈసినిమాను భారీ అంచనాల నడుమ తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు.. ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఆస్కార్ సాధిస్తే మాత్రం రామ్ చరణ్ పై తదుపరి సినిమాల బాధ్యత మరింత పెరిగుతుందని చెప్పాలి. దీంతో ప్రస్తుతం తాను చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చరణ్.
ఈ క్రమంలో సౌత్ ఇండియా అగ్ర దర్శకుల్లో ఒకరైన శంకర్ తో ఆర్సీ 15 చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడో వెళ్లినా.. ఎలాంటి చిన్న అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీనితో అభిమానులు ఈ విషయంలో బాగా నిరాశకు లోనయ్యారని తెలుస్తుంది. కానీ.. ఇప్పుడు ఫ్యాన్స్ ని ఖుషీ చేయడానికి రామ్ చరణ్ పుట్టిన రోజున ఆర్సీ15 సినిమాకు సంబంధించి టైటిల్ రివీల్ చేయబోతున్నారని టాక్.