
‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ చిత్రంతో అలరించిన సుధీర్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేస్తూ తెలుగు ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సుధీర్ బాబు నటిస్తున్న 16వ చిత్రం రిలీజ్ కు సిద్ధమవుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. సుధీర్ బాబు నయా లుక్ ఆయన అభిమానులను, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ గా వస్తున్ ఈ చిత్రం టైటిల్ కూడా నెక్ట్స్ లెవల్ లో అనిపిస్తోంది.
ఈ యాక్షన్ ఫిల్మ్ కు చిత్ర యూనిట్ ‘హంట్ : గన్స్ డోంట్ లై’ (Hunt : Guns Dont Lie) అనే మాసీవ్ టైటిల్ ఖరారు చేయడం సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. మరోవైప్ ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది. పూర్తిగా యాక్షన్ ఫిల్మ్ గా కనిపిస్తోంది. పోస్టర్ లో సుధీర్ బాబు విగ్రహం, భారీ గన్స్, హ్యాండ్ కప్స్, ఓ క్లాక్ టవర్ ఉండటంతో సినిమాలో చాలా ట్విస్ట్ లు కూడా ఉండనున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తాన్ని సుధీర్ అభిమానులకు, కొత్తరకం సినిమాలను కోరుకునే సినీ ప్రియులకు ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సినిమా విషయాలను నిర్మాత వి. ఆనంద ప్రసాద్ పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. సుధీర్ బాబు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించనున్న చిత్రమిది. ఆయనతో పాటు శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ పోలీస్ ఆఫీసర్లుగా చేస్తున్నారు. ఈ ముగ్గురూ క్లోజ్ ఫ్రెండ్స్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. చాలా స్టైలిష్ ఫిల్మ్. ఇప్పటి వరకు వచ్చిన సుధీర్ బాబు సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సులు చాలా సహజంగా, కొత్త అనుభూతి ఇచ్చేలా ఉంటాయి. కనిపించని శత్రువు కోసం జరిపే వేట ఈ సినిమా ప్రధాన కథాంశం. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తాం.
సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హంట్’ను తెరకెక్కిస్తున్నారు. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. వి. ఆనంద ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో ఈ చిత్ర రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది. గతంలో విడుదలైన పోస్టర్ కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సుధీర్ బాబు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో సీనియర్ హీరో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్, గోపరాజు రమణ, 'జెమినీ' సురేష్, మైమ్ గోపి, అజయ్ రత్నం తదితరులు నటిస్తున్నారు.