Virata Parvam: దూసుకుపోతున్న 'విరాట పర్వం' ట్రైలర్.. రానా, సాయి పల్లవి నటనకు ఫిదా..

Published : Jun 06, 2022, 12:59 PM IST
Virata Parvam: దూసుకుపోతున్న 'విరాట పర్వం' ట్రైలర్.. రానా, సాయి పల్లవి నటనకు ఫిదా..

సారాంశం

విరాట పర్వం చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. వేణు ఊడుగుల తన దర్శకత్వంలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లోని కథని ఎమోషనల్ గా పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేస్తున్నారు.

వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'నీది నాది ఒకే కథ' చిత్రంతో వేణు ఊడుగుల విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. దీనితో విరాటపర్వం కథని చాలా బలంగా రాసుకున్నారు. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నక్సలిజం బ్యాక్  డ్రాప్ లో రానా ఎంచుకున్న మరో ప్రయోగాత్మక చిత్రం ఇది. 

ఇటీవల కర్నూలులో విరాట పర్వం చిత్ర ట్రైలర్ ని లాంచ్ చేశారు. నటుడిగా రానా తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. సాయి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో విరాట పర్వం ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. 

విరాట పర్వం చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. వేణు ఊడుగుల తన దర్శకత్వంలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లోని కథని ఎమోషనల్ గా పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేస్తున్నారు. రానా, సాయి పల్లవి స్టోరీ థీమ్ కి తగ్గట్లుగా నటనలో చెలరేగిపోయారు. దీనితో ట్రైలర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎస్ ఎల్ వి సినిమాస్ యూట్యూబ్ ఛానల్ లో విరాట పర్వం ట్రైలర్ 6 మిలియన్ల వ్యూస్ దాటేసింది. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ ఛానల్ లో మరో నాలుగు మిలియన్లు.. మొత్తంగా దాదాపు 10 మిలియన్లకి పైగా డిజిటల్ వ్యూస్ తో విరాట పర్వం ట్రైలర్ దూసుకుపోతోంది. 

సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు. నివేత పేతురాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర , నందిత దాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్