బిగ్ బాస్ వివాదం.. స్పందించిన 'స్టార్ మా'!

By AN TeluguFirst Published Jul 30, 2019, 9:43 AM IST
Highlights

శ్వేతారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ నేపధ్యంలో పోలీసులు బిగ్ బాస్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన స్టార్ మా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ కు ఆరు ప్రశ్నలతో కూడిన నోటీసులు జారీ చేశారు. 

బిగ్ బాస్ వ్యవహారంలో బంజారాహిల్స్ పోలీసులు స్టార్ మా ప్రతినిధికి నోటీసులు ఇచ్చిన క్రమంలో వారు సోమవారం సమాధానమిచ్చారు. జర్నలిస్ట్ శ్వేతారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ నేపధ్యంలో పోలీసులు నలుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన స్టార్ మా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ కు ఆరు ప్రశ్నలతో కూడిన నోటీసులు జారీ చేశారు.

ఈ ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా ప్రోగ్రాం డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరని ప్రశ్నించగా.. డైరెక్టర్ గా అభిషేక్, నిర్మాతగా ఇండీమోల్ ఇండియా  ప్రైవేట్  లిమిటెడ్ సంస్థలు వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్వ్యూ విధానం ఇండీమోల్ సంస్థ ప్రొడక్షన్ హౌస్ తో పాటు స్టార్ మా, మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అసిస్ట్స్‌ చూసుకుంటారని చెప్పారు.

ఎంపిక చేసిన సభ్యుల వివరాలను అందజేశారు. ఎంపిక ప్రక్రియకు దాదాపు వందకుపైగా అభ్యర్ధులు రాగా.. అందులో నుండి ఆడియన్స్ లో గుర్తింపు, పాపులారిటీ ఉన్న వారిని ఎంపిక చేస్తామంటూ బదులిచ్చారు. సంస్థలో శ్యాంశంకర్‌ ప్రోగ్రాం డిపార్ట్‌మెంట్‌ ఉపాధ్యక్షులుగా, అభిషేక్‌ ముఖర్జీ ఇండీమోల్‌ క్రియేటివ్‌ కన్సల్టెంట్‌గా, రవికాంత్‌ లీలార్క్‌  క్రియేషన్స్‌ మేనేజర్‌గా, రఘు స్టార్‌ మా పీఆర్వోగా, ఉపాధ్యక్షులుగా ఉన్నారని సమాధానమిచ్చారు.

ప్రోగ్రాం కోసం చివరగా ఎంపిక చేసి వారిని ఎందుకు రిజెక్ట్ చేశారనే కోణంతో పాటు ఎవరెవరిని రిజెక్ట్ చేశారో వివరాలు కావాలని కోరినట్లు పోలీసులు స్పష్టం చేశారు. 

click me!