సవ్యసాచి లో నాగ్ సెంటిమెంట్!

By Prashanth MFirst Published Sep 26, 2018, 4:20 PM IST
Highlights

 రీసెంట్ గా వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేదు. అయితే ఎలాగైనా నెక్స్ట్ రాబోయో సవ్యసాచి తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. 

ప్రేమమ్ హిట్ ఇచ్చిన చందు మొండేటి ఆ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

గత ఏడాది మొదట్లో రారండోయ్ వేడు చూద్దాం సినిమాతో సక్సెస్ అందుకున్న నాగచైతన్య ఆ తరువాత యుద్ధ శరణం సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ అందుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేదు. అయితే ఎలాగైనా నెక్స్ట్ రాబోయో సవ్యసాచి తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. 

ప్రేమమ్ హిట్ ఇచ్చిన చందు మొండేటి ఆ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. నవంబర్ 2న సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర పేరు విక్రమ్ అని తెలిసింది. నాగార్జున మొదటి సినిమా టైటిల్ అండ్ క్యారెక్టర్ నేమ్ కూడా విక్రమ్. ఆ సినిమా నాగ్ కి నటనాపరంగా మంచి ఇమేజ్ ను తెచ్చింది. 

ఇక చైతు నేమ్ కూడా విక్రమ్ కావడంతో సవ్యసాచికి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చిత్ర యూనిట్ నుంచి టాక్ వస్తోంది. చైతూకి సినిమాలో పవర్స్ ఉంటాయట. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నార్త్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎమ్ఎమ్.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.     

click me!